2013 నైట్రో ట్రాక్టర్‌ను ఆవిష్కరింటిన లాంబోర్గినీ

By Ravi

కోట్ల ఖరీదు చేసే సూపర్‌కార్లను తయారు చేసే కంపెనీ ట్రాక్టర్లను తయారు చేసే ఎలా ఉంటుంది. ఇదిగో ఈ ఫోటోలో కనిపించే విధంగానే ఉంటుంది. ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్‌కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీ అభివృద్ధి చేసిన సరికొత్త ట్రాక్టర్ ఇది. దీని పేరు 'నైట్రో'. వాస్తవానికి లాంబోర్గినీ సూపర్‌కార్ల తయారీ కన్నా ముందుగా ట్రాక్టర్లను ఉత్పత్తి చేసేది.

లాంబోర్గినీ యజమాని ఫెర్షుయో లాంబోర్గినీ కొనుగోలు చేసిన ఫెరారీ 250జిటి సూపర్‌కారులో తరచూ క్లచ్ సమస్య తలెత్తుతుండటంతో, తామే ఎందుకు జిటి, సూపర్‌‌కార్లను తయారు చేయకూడదని ఆయన భావించారు. ఆ తర్వాతనే లాంబోర్గినీ సూపర్‌కార్లు మన ముందుకు వచ్చాయి. లాంబోర్గినీ ట్రాక్టర్ల వ్యాపారం ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఈ వ్యాపారం ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లాంబోర్గినీ ఈ సరికొత్త 2013 నైట్రో ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది.

లాంబోర్గినీ అందిస్తున్న సాధారణ ట్రాక్టర్లతో పోల్చుకుంటే ఈ 2013 నైట్రో ట్రాక్టర్ చాలా విశిష్టమైనది. ఈ సరికొత్త స్టయిలిష్ ట్రాక్టర్‌ను ఇటాలియన్ ఆటోమొబైల్ డిజైనర్ జియోర్జెట్టో జియుజియారో డిజైన్ చేశారు. ముందువైపు ఎల్ఈడి లైట్స్, వెనుక వైపు డ్యూయెల్ లైట్స్, డ్యూయెల్ కలర్ పెయింటింగ్, స్టయిలిష్ అండ్ మోడ్రన్ ఇంటీరియర్స్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ఈ నైట్రో ట్రాక్టర్‌ను అభివృద్ధి చేశారు. దీని సాంకేతిక వివరాలను కంపెనీ వెల్లడించకపోయినప్పటికీ ఇధి మీడియం పవర్ ట్రాక్టర్‌గా కనిపిస్తుంది. మరి ఈ స్టయిలిష్ లాంబోర్గినీ ట్రాక్టర్‌పై ఓ లుక్కేస్కోండి..!

2013 లాంబోర్గినీ నైట్రో ట్రాక్టర్‌

2013 లాంబోర్గినీ నైట్రో ట్రాక్టర్‌

2013 లాంబోర్గినీ నైట్రో ట్రాక్టర్‌

2013 లాంబోర్గినీ నైట్రో ట్రాక్టర్‌

2013 లాంబోర్గినీ నైట్రో ట్రాక్టర్‌

2013 లాంబోర్గినీ నైట్రో ట్రాక్టర్‌

2013 లాంబోర్గినీ నైట్రో ట్రాక్టర్‌

2013 లాంబోర్గినీ నైట్రో ట్రాక్టర్‌

2013 లాంబోర్గినీ నైట్రో ట్రాక్టర్‌

2013 లాంబోర్గినీ నైట్రో ట్రాక్టర్‌

Most Read Articles

English summary
Italy based supercar maker Lamborghini has compleated 50 years of its tractor business. The company has now unveiled the stylish new 2013 Nitro tractor. The 2013 Nitro, unlike a typical tractor is extremely stylish, having been designed by well known Italian automobile designer Giorgetto Giugiaro.
Story first published: Tuesday, February 26, 2013, 14:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X