చెవర్లె సెయిల్ యువాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో తాజాగా ప్రవేశపెట్టిన సరికొత్త చెవర్లే సెయిల్ యువా (Chevrolet Sail U-VA) హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. డీజిల్ వెర్షన్ సెయిల్‌లో ఈ కొత్త బేస్ వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. సెయిల్ యువా విడుదలైనప్పటి నుంచి ఈ మోడల్ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ప్రత్యేకించి డీజిల్ వెర్షన్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు.

ఇందుకు ప్రధానం కారణంగా డీజిల్ వెర్షన్ సెయిల్ యువా ధరలు అధికంగా ఉండటమే. ఈ నేపథ్యంలో, సెయిల్ యువా అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఇందులో బేస్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. సెయిల్ విడుదలైన సమయంలో ఇది 4 పెట్రోల్ వేరియంట్స్, 3 డీజిల్ వేరియంట్లలో మాత్రమే లభ్యమయ్యేది. కాగా ఇప్పుడు డీజిల్ వెర్షన్ సెయిల్ యువా కూడా 4 వేరియంట్లలో లభ్యం కానుంది. ఈ బేస్ వేరియంట్ చెవర్లే సెయిల్ యువా ధర రూ.5.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Chevrolet Sail UVA

జనరల్ మోటార్స్ ఇండియా తమ అధికారిక వెబ్‌సైట్ ఈ కొత్ వేరియంట్‌ను జోడించింది, కానీ ఇందుకు సంబంధించి ఫీచర్ల జాబితాను మాత్రం వెల్లడించలేదు. అయితే, పెట్రోల్ వెర్షన్ సెయిల్ యువా బేస్ వేరియంట్‌లో లభిస్తున్న ఫీచర్లే ఇందులోను ఉండొచ్చని అంచనా. పెట్రోల్ వెర్షన్ బేస్ వేరియంట్‌లో ఉన్న మ్యాన్యువల్ ఏసి, ఫ్యాబ్రిక్ సీట్స్, టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్ వీల్, రిమోట్ బూట్ ఓపెనర్, ఫ్రంట్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఓవిఆర్ఎమ్స్ వంటి ఇంటీరియర్ ఫీచర్లు ఈ డీజిల్ వెర్షన్ బేస్ వేరియంట్‌లో కూడా ఉండనున్నాయి.

ఇక ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే.. అల్లాయ్ వీల్స్ స్థానంలో స్టీల్ వీల్స్, బాడీ కలర్డ్ బంపర్స్ ఫీచర్లను గమనించవచ్చు. ఇందులో 1.3 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 79 పిఎస్‌ల శక్తిని, 205 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. చెవర్లే పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ బేస్ వేరియంట్ డీజిల్ వెర్షన్ సెయిల్ యువా లీటరు డీజిల్‌కు 22 కి.మీ. మైలేజీనివ్వనుంది (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం).

Most Read Articles

English summary
Chevrolet Sail U-VA diesel price not starts at Rs. 5.29 lakh (ex-showroom Delhi). General Motors have added a new base version to the portfolio of its Chevrolet Sail U-VA diesel. This will powered by a 1.3-litre diesel engine which generates 79PS of power and 205Nm of torque.
Story first published: Friday, March 15, 2013, 16:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X