ఫిబ్రవరి 6న విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ శాంటాఫే

By Ravi

సరికొత్త హ్యుందాయ్ శాంటాఫే విడుదలకు ముహుర్తం ఖరారైంది. పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన నెక్స్ట్ జనరేషన్ 2014 శాంటాఫే ఎస్‌యూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విడుదల చేయనుంది. ఇదివరకటి తరం శాంటాఫేతో పోల్చుకుంటే, కొత్త శాంటాఫే 40 మి.మీ. పొడవును, 5 మి.మీ. వెడల్పులను కలిగి ఉంటుంది.

అలాగే దీని రూఫ్‌లైన్‌ను 45 మి.మీ. తగ్గించారు. కానీ వీల్‌‌బేస్‌ను మాత్రం యధావిధిగా 2700 మి.మీ. గానే ఉంచారు. వీటిని బట్టి చూస్తుంటే, కొత్త హ్యుందాయ్ శాంటాఫే మునుపటి వెర్షన్ కన్నా మరింత ఎక్కువ ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేయనుందని తెలుస్తోంది. ఇందులో 7-సీటర్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇకపోతే, లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, కొత్త హ్యుందాయ్ శాంటాఫే ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 2.2 లీటర్ విజిటి (వేరియబల్ జియోమెట్రీ టర్బో) డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 194 బిహెచ్‌పిల శక్తిని, 44.55 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ మైలేజ్, తక్కువ కర్బణ వ్యర్థాలను విడుదల చేసేలా ఈ ఇంజన్‌ను రీట్యూన్ చేశారు.

New Hyundai Santa Fe

పాత మోడల్ కన్నా కొత్త శాంటాఫే మోడల్ మరింత మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉండనుంది. ఈ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, చెవర్లే కాప్టివా వంటి మోడళ్లకు ధీటుగా ఉండేలా దీని ఇంటీరియర్, ఎక్స్టీరియర్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. హ్యుందాయ్ తమ కొత్త శాంటాఫే ఎస్‌యూవీని స్థానికంగా భారతదేశంలోనే అసెబ్లింగ్ చేయాలని యోచిస్తోంది. చెన్నైలో ఉన్న కంపెనీ ప్లాంటులో ఈ ఎస్‌యూవీని తయారు చేసే అవకాశం ఉంది. ఫలితంగా దీని ధర కూడా తక్కువగా ఉండొచ్చని అంచనా.

భారత మార్కెట్లో కొత్త 2014 హ్యుందాయ్ శాంటాఫే ప్రారంభ ధర రూ.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. ఇది టూ-వీల్ డ్రైవ్, ఆల్-డ్రైవ్ ఆప్షన్లతో లభ్యం కానుంది. కొత్త శాంటాఫేలో రీడిజైన్ చేయబడిన ఎక్స్టీరియర్లతో పాటుగా, మెరుగైన నాణ్యత, కొత్త ఎక్విప్‌మెటంట్స్ మరియు ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
Hyundai will launch the 2014 Santa Fe SUV in India on February 6, 2014 during the Auto Expo. The new Santa Fe is expected to perform a lot better in India than its predecessor as Hyundai has identified the weak links and will sort it out with the coming of the new model.
Story first published: Tuesday, December 17, 2013, 11:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X