కొత్త రేంజ్ రోవర్ ఇప్పుడు సరికొత్త డీజిల్ ఇంజన్‌తో..

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' భారత మార్కెట్లో అందిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ 'రేంజ్ రోవర్' ఇప్పుడు మరింత శక్తివంతమైన, సరికొత్త డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది కొత్త రేంజ్ రోవర్ 3.0 లీటర్ టిడివి6 డీజిల్ ఇంజన్‌ను ఆఫర్ చేస్తున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ ఇంజన్ గరిష్టంగా 258 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఇది జెడ్‌ఎఫ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ సందర్భంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రోహిత్ సూరి మాట్లాడుతూ.. భారత మార్కెట్ నుంచి తమ సరికొత్త రేంజ్ రోవర్‌కు మంచి ఆదరణ లభించిందని, ఇందులో కొత్త 3.0 లీటర్ టిడివి6 డీజిల్ ఇంజన్ చేరికతో ఈ ఆదరణ మరింత పెరుగుతుందని చెప్పారు.

ఇందులో ఉపయోగించిన కొత్త ఇంజన్ 258 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 600 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తూ సాటిలేని పెర్ఫామెన్స్‌ను అందిస్తుందని ఆయన తెలిపారు. ఇది కేవలం 7.9 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈ కొత్త రేంజ్ రోవర్ 5.0 లీటర్ వి8 సూపర్‌ఛార్జ్‌డ్ పెట్రోల్, 4.4 లీటర్ వి8 డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో కూడా లభ్యమవుతుంది. కాగా.. కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన 3.0 లీటర్ టిడివి6 రేంజ్ రోవర్ హెచ్ఎస్ఈ, వోగ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

New Range Rover
Most Read Articles

English summary
The highly-acclaimed all-new Range Rover is offering Indian customers increased powertrain choice with the introduction of the new 3.0 TDV6 diesel engine. Available in the Range Rover for the first time, the refined and ultra-efficient 258PS 3.0-litre TDV6 diesel, delivers effortless performance. The all-new Range Rover with a 3.0-litre TDV6 diesel engine is now available to order in two trim levels, HSE and Vogue.
Story first published: Wednesday, March 20, 2013, 17:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X