నిస్సాన్ కార్లను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే కొనుక్కోవచ్చు!

By Ravi

ఆన్‌లైన్‌లో కేవలం అప్పీరల్స్, గ్యాడ్జెట్స్, యాక్ససరీస్‌లనే కాదు కార్లను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఈ తరహా విధానం అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. కాగా.. ఇప్పుడు ఈ ట్రెండ్ భారత్‌కు కూడా పాకింది. జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా, భారత్‌లోని తమ కొనుగోలుదారుల కోసం ఆన్‌లైన్ సేల్‌ను ప్రారంభించనుంది.

ఇది కూడా చదవండి: నిస్సాన్ టెర్రానో టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

ఈ విషయం గురించి హోవర్ ఆటోమోటివ్ ఇండియా (నిస్సాన్ యొక్క జాతీయ సేల్స్ కంపెనీ) మార్కెటింగ్ డైరెక్టర్ నితీష్ టిప్నిస్ మాట్లాడుతూ.. ఈరోజుల్లో అనేక మంది కొనుగోలుదారులు కారు కొనే విషయంలో నిర్ణయం తీసుకోవాటని ముందు ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేస్తున్నారని, ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇంటర్నెట్లో అవకాశాలు సంవృద్ధిగా ఉన్నాయని అన్నారు. కొనుగోలు సమయంలో ఖచ్చితమైన డెలివరీ, సర్వీస్‌లను ఆఫర్ చేసేలా నిర్దేశిత కార్ పోర్టల్స్ ద్వారా కస్టమర్లకు తగిన పేమెంట్ గేట్‌వేలను ఆఫర్ చేస్తామని చెప్పారు.

Nissan Cars Online Purchase

ఈ విధానం ద్వారా కస్టమర్ల కారు కొనుగోలు ప్రక్రియ సులభతరమవుతుందని, అంతేకాకుండా వినియోగదారుల సమయం కూడా చాలా ఆదా అవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం నిస్సాన్ భారత మార్కెట్లో లగ్జరీ సెడాన్ టీనా, మిడ్-సైజ్ సెడాన్ సన్నీ, ఇటీవల విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ టెర్రానో, కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ మైక్రా, ప్రీమియం ఎస్‌యూవీ ఎక్స్-ట్రైల్, ఎమ్‌పివి ఇవాలియా మరియు స్పోర్ట్స్ కారు 370జెడ్ మోడళ్లను ఆఫర్ చేస్తోంది.
Most Read Articles

English summary
Purchasing cars via the internet, is quickly being adopted by a few manufacturers from around the world. The newbie to this group is Nissan India, who would soon make its entire product line available for purchase via the internet.
Story first published: Monday, December 9, 2013, 14:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X