జనవరి 2014 నుంచి పెరగనున్న నిస్సాన్ కార్ల ధరలు

By Ravi

జనవరి 2014 నుంచి ధరలను పెంచనున్న కార్ల జాబితాలో తాజాగా నిస్సాన్ మోటార్ ఇండియా వచ్చి చేరింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి తమ ఉత్పత్తుల ధరలను మోడల్‌ను బట్టి 2 నుంచి 4 శాతం మేర ధరలు పెంచుతామని కంపెనీ ప్రకటించింది.

రూపాయి విలువ క్షీణత, పెరుగుతున్న ఉత్పాదక వ్యయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పెరిగిన ధరలు జనవరి 2014 నుంచి అమల్లోకి వస్తాయని నిస్సాన్ మోటార్ ఇండియా తెలిపింది.

నిస్సాన్ తీసుకున్న తాజా నిర్ణయంతో, మైక్రా మరియు మైక్రా యాక్టివ్ హ్యాచ్‌బ్యాక్స్, మిడ్-సైజ్ సెడాన్ సన్నీ, మల్టీ పర్సప్ వెహికల్ ఇవాలియా, కాంపాక్ట్ ఎస్‌యూవీ టెర్రానో ధరలు మరింత ప్రియం కానున్నాయి.

Nissan Price Hike

ప్రస్తుతం రూపాయి విలువ స్థిరంగా ఉన్నప్పటికీ, అధిక మారకపు రేట్లు తమ ఖర్చులపై ప్రభావం చూపాయని, అలాగే ద్రవ్యోల్బణం కూడా ఇన్‌పుట్ కాస్ట్స్ మరియు ముడి సరుకుల ధరల పెరుగులకు కారణం కావటం వంటి పలు కారణాల వలన వేరే గత్యంతరం లేక ధరలు పెంచాల్సి వస్తోందని హోవర్ ఆటోమోటివ్ ఇండియా (నిస్సాన్ యొక్క జాతీయ సేల్స్ కంపెనీ) యాక్టింగ్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) రిచర్డ్ డి స్పిట్జర్ తెలిపారు. ఈ ధరల పెంపు మార్జినల్ మాత్రమేనని, ప్రపంచ ప్రసిద్ధి చెందిన తమ ఉత్పత్తులను సరసమైన ధరలకే తమ విలువైన వినియోగదారులకు అందిస్తున్నామని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా, జనవరి 2014 మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. కేవలం ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీలే కాకుండా, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ కంపెనీలు కూడా కొత్త సంవత్సరంలో ధరలను పెంచనున్నాయి.

Most Read Articles

English summary
Nissan has announced its decision to hike prices of selected models which it sells in India. The increase in price will range from two to four percent depending on the model. According to Nissan's official statement, the decision to bump prices is a direct result of rupee depreciation and escalating manufacturing costs. The latest price hike will come into effect from January 2014.
Story first published: Tuesday, December 10, 2013, 17:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X