భారత్‌లో మైక్రా, సన్నీ కార్లను రీకాల్ చేసిన నిస్సాన్

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్స్ మైక్రా హ్యాచ్‌బ్యాక్, నిస్సాన్ సెడాన్లను రీకాల్ చేస్తున్న కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కార్లలో మాస్టర్ బ్రేక్ సిలిండర్ల కారణంగా వీటిని వెనక్కు పిలిపిస్తున్నామని, ఈ లోపపూరిత విడిభాగాన్ని ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీ పేర్కొంది.

మొత్తం 22,188 మైక్రా, సన్నీ కార్లలో ఈ సమస్యను గుర్తించామని, ఈ నెలలో సమస్య ఉన్న కార్లను గుర్తించడం ప్రారంభించామని, ఈ సమస్య గురించి కస్టమర్లకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నామని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది. నిస్సాన్ డీలర్లు ఈ మాస్టర్ బ్రేక్ సిలిండర్‌ను కస్టమర్ నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా, ఉచితంగా రీప్లేస్ చేస్తారని నిస్సాన్ ఇండియా వెల్లడించింది.

Nissan Sunny And Micra Recall

వినియోగదారులకు పూర్తిస్థాయి భద్రతతో కూడిన ఉత్పత్తులను మరియు సంతృప్తితో కూడిన సర్వీస్‌ను అందించడానికి నిస్సాన్ కట్టుబడి ఉంటుందని, ఈ దిశలో భాగంగానే లోపపూరిత మాస్టర్ బ్రేక్ సిలిండర్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. గతంలో ఇదే సమస్యపై ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాల నుంచి మొత్తం 67,089 కార్లను నిస్సాన్ రీకాల్ చేసింది.

కాగా.. ఈ సమస్యల వలన ఇంతవరకూ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ముందస్తు భద్రత చర్యలో భాగంగా ఈ రీకాల్‌ను ప్రకటించామని నిస్సాన్ ఇండియా తెలిపింది. ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది భారత్‌లో లక్ష కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ దిశలో భాగంగా రానున్న రోజుల్లో 4 కొత్త కార్లను మార్కెట్లో విడుదల చేస్తామని, పల్స్/మైక్రా, సన్నీ/స్కాలా కార్ల మాదిరిగా కాపీ ఉత్పత్తులను తయారు చేయబోమని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Nissan has issued recalls for its Sunny four door saloon and Micra hatchback in India. The recall is a part of its global recall that affected units from Africa, Europe and some other countries in Asia, with 67,089 vehicles falling under it.
Story first published: Friday, May 24, 2013, 17:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X