ప్రమాద రహిత కార్ల తయారీ కోసం చేపలపై అధ్యయనం!

By Ravi

ఎగిరే పక్షి నుంచి స్ఫూర్తి పొంది విమానం తయారు చేశారు. నీటిలో ఈదే చేప నుంచి స్ఫూర్తి పొంది జలాంతర్గామి సృష్టించారు. ప్రకృతిలోని ఏదో ఒక అంశం నుంచి స్ఫూర్తి ఇప్పటికే అద్భుతాలను సృష్టించారు మన పరిశోధకులు. ఇప్పుడు మనం చదవబోయేది అలాంటి ఓ అద్భుతమైన పరిశోధనలలో ఒకటి. నీటిలో గుంపులుగా ఒకదాని వెనుక మరొకటి వెళ్లే చేపలకు హఠాత్తుగా ఏదైనా అవాంతరం ఎదురైతే ఒకదానినొకటి గుద్దుకోకుండా, అంతే హఠాత్తుగా తమ దిశను మార్చుకొని వేరొక వైపుకు ప్రయాణిస్తాయి.

ఈ చేపల కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ ఓ అద్భుతమైన టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఇకపై రోడ్డు ప్రమాదలనేవే సంభవించబోవు. ఈ ప్రయోగం కోసం నిస్సాన్ మోటార్ కంపెనీ ఏడు చిన్ని రోబోట్లను తయారు చేసింది. ఈ రోబోట్‌ను 'ఎపొరో' అని పిలుస్తారు. ఇవి బ్యాటరీల సాయంతో నడుస్తాయి. ఇందులో ముందుగా నిక్షిప్తం చేయబడిన ప్రోగ్రామ్ ప్రకారం, ఇవి గ్రూపుగా ఒకదాని వెనుక మరొకటి ప్రయాణిస్తాయి.

ఈ రోబోట్‌లను ఇంజనీర్ సుసుము ఫుజిటా 2009లో సృష్టించారు. చేపలు ఈదే విధానం నుంచి స్ఫూర్తి పొంది ఈ రోబోల ప్రవర్తను డిజైన్ చేశామని, ఇవి ఒకే లైనులో ప్రయాణిస్తూ అడ్డంకులను తప్పించుకుంటూ పోతాయని ఆయన తెలిపారు. 'సేఫ్టీ షీల్డ్' అనే సేఫ్టీ కాన్సెప్ట్‌ను నిస్సాన్ అభివృద్ధి చేయనున్న ప్రమాద రహిత వాహనాలలో ఉపయోగించనుంది. మరి ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, భవిష్యత్తులో అస్సలు రోడ్డు ప్రమాదాలే ఉండబోవన్నమాట. మీరేమంటారు..?

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

నిస్సాన్ ఎపొరో రోబోట్

Most Read Articles

English summary
Engineer Susumu Fujita created these robots in 2009. He says the robots behavior is inspired by the way fish swim. They move in schools, in streams, and avoid obstacles.“The technology in these robots is similar to what will be used to build and perfect an autonomous car. The EPORO can already follow the leader, even if the leader is me,” said Fujita-san.
Story first published: Tuesday, March 19, 2013, 15:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X