నిస్సాన్ సన్నీ ఆటోమేటిక్ విడుదల; ధర రూ.8.49 లక్షలు

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ సన్నీలో ఆటోమేటిక్ వెర్షన్‌ను విడుదలకు సంబంధించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, నిస్సాన్ ఇండియా తమ ఆటోమేటిక్ సన్నీ సెడాన్‌ను కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకువచ్చిం. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఈ కొత్త వేరియంట్‌ను కంపెనీ సైలెంట్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ తమ అధికారి వెబ్‌సైట్‌లో ఉంచింది.

నిస్సాన్ సన్నీ ఆటోమేటిక్ కేవలం ఎక్స్ఎల్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతుంది. భారత మార్కెట్లో ఈ కారు ధర రూ.8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇదే కారును రీబ్యాడ్జ్ చేసి రెనో ఇండియా అందిస్తున్న ఆటోమేటిక్ రెనో స్కాలా ధర రూ.8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ధర విషయంలో ఈ రెండు మోడళ్లకు పెద్దగా తేడా లేదు.

మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన నిస్సాన్ సన్నీ సెడాన్‌లో ఉపయోగించిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే ఈ ఆటోమేటిక్ వెర్షన్ నిస్సాన్ సన్నీలోను ఉపయోగించారు. అయితే, ఈ ఇంజన్ శక్తిని (పవర్) స్వల్పంగా పెంచారు. మ్యాన్యువల్ వేరియంట్ 97 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుండగా, ఆటోమేటిక్ వేరియంట్ గరిష్టంగా 99.6 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Nissan Sunny Automatic

ఇందులో ఉపయోగించిన ఎక్స్-ట్రానిక్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌ సాధారణ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల కన్నా భిన్నంగా ఉంటుంది. దీని అధిక గేర్ రేషియోల సంఖ్య కారణంగా కారు జర్క్‌లు ఇవ్వకుండా సాఫీగా ముందుకు సాగిపోవటమే కాకుండా మెరుగైన మైలేజీని కూడా ఇస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం నిస్సాన్ సన్నీ సివిటి లీటరు పెట్రోల్‌కు 17.97 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో లభ్యమవుతున్న ఆటోమేటిక్ కార్లు, వాటి ధరలు ఇలా ఉన్నాయి:

  • నిస్సాన్ సన్నీ పెట్రోల్ ఎక్స్ఎల్ సివిటి - రూ.8.49 లక్షలు
  • రెనో స్కాలా పెట్రోల్ ఆర్ఎక్స్ఎల్ సివిటి - రూ.8.99 లక్షలు
  • ఫోర్డ్ ఫియస్టా ఆటోమేటిక్ స్టైల్ - రూ.10.01 లక్షలు
  • హోండా సిటీ ఎస్ ఆటోమేటిక్ - రూ.9.25 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Most Read Articles

English summary
Nissan India has introduced the automatic version Sunny. The Nissan Sunny CVT is available in the mid-spec XL (petrol) variant only and is priced at Rs 8.49 lakh (ex-showroom).
Story first published: Wednesday, April 17, 2013, 10:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X