రోల్స్ రాయిస్ ఫాంటమ్‌లో 2020 వరకు నో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లలో ఒకటైన 'రోల్స్ రాయిస్ ఫాంటమ్' మరో ఆరేళ్ల పాటు ప్రస్తుత అవతారంలోనే లభ్యం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని కార్ల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటూ, మోడ్రన్ డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీతో తీర్చిద్దిన కార్లను విడుదల చేస్తుంటే, రోల్స్ రాయిస్ మాత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెత చందంగా 2020 వరకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఫాంటమ్ గురించి ఆలోచించబోమని చెబుతోంది.

రోల్స్ రాయిస్ తమ కార్ల డిజైన్, పెర్ఫామెన్స్, డ్రైవింగ్ క్వాలిటీ వంటి అంశాల్లో ఇప్పటికీ తగినంత సమర్థత ఉందని, అదే తమను ముందుకు నడిపిస్తుందని భావిస్తుంది. దీనికి ఇంకో ప్రధాన కారణం కూడా ఉంది. ఓ లగ్జరీ కారు కోసం రూ.4 కోట్లకు పైగా మొత్తాన్ని చెల్లించే ఏ కస్టమర్ అయినా కూడా తన కారు అవుట్‌డేటెడ్ మోడల్ కాకూడదని భావిస్తుంటారు.

Rolls Royce Phantom

ఉదాహరణకు, ఓ కస్టమర్ రూ.4 కోట్లు చెల్లించి 2012వ సంవత్సరంలో ఫాంటమ్ కారును కొనుగోలు చేశాడు అనుకుందాం. కానీ రోల్స్ రాయిస్ 2014వ సంవత్సరంలో మునుపటి వెర్షన్ కన్నా మెరుగైన డిజైన్, ఫీచర్స్, టెక్నాలజీతో కూడిన కొత్త ఫాంటమ్‌ను విడుదల చేసినట్లయితే, 2012లో ఇదే బ్రాండ్ కారు కొన్న వ్యక్తి మోడల్ అవుట్‌డేటెడ్‌గా అనిపిస్తుంది. అన్ని కోట్లు వెచ్చించేటప్పుడు మోడల్ యొక్క లైఫ్ టైమ్ కూడా చాలా ముఖ్యం. అందుకే, రోల్స్ రాయిస్ తమ కార్లలో త్వరగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను ప్రవేశపెట్టదు.

రోల్స్ రాయిస్ తమ ఫాంటమ్ సిరీస్ లగ్జరీ కార్లను 2003లో మార్కెట్‌కు పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇందులో కంప్లీట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల కాలేదంటే ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. ఏదేమైనప్పటికీ, 2020లో కానీ లేదా ఆ తర్వాత కానీ ఫాంటమ్ సిరీస్‌లో అప్‌గ్రేడెడ్ కారును రోల్స్ రాయిస్ విడుదల చేసే అవకాశం ఉంది. రోల్స్ రాయిస్ తమ కార్లను పూర్తిగా చేతుల్తో తయారు చేస్తుంది. ఈ కార్ల ఇంటీరియర్, ఎక్స్టీరియర్లను కస్టమర్లు తమకు నచ్చిన విధంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు కానీ బేసిక్ డిజైన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవటం కుదరదు. అందుకే, రోల్స్ రాయిస్ ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి పాపులారిటీని దక్కించుకోగలిగింది.

Most Read Articles

English summary
British luxury carmaker Rolls Royce has no plans to bring a facelift version Phantom in near future. The Phantom series will last in the global markets for over 6 years now and the new Phantom facelift is expected only after 2020.
Story first published: Thursday, November 14, 2013, 13:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X