అఫీషియల్: నవంబర్ 25న కొత్త హోండా సిటీ విడుదల

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా మోటార్ కార్స్ ఇండియా ఓ కొత్త తరం హోండా సిటీ సెడాన్‌ (కోడ్‌‌నేమ్: 2సిటి)ను అభివృద్ధి చేస్తోందని, దానిని ఈనెల 25న భారత మార్కెట్లో విడుదల చేస్తుందని మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించడం జరిగింది. తాజాగా.. ఇదే విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. నవంబర్ 25న న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో తమ కొత్త సిటీని విడుదల చేయనున్న కంపెనీ స్పష్టం చేసింది.

ఈ మేరకు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఓ టీజర్ ఫొటోను కూడా విడుదల చేసింది. 'బి ద ఫస్ట్ టూ సీ ద నెక్స్ట్ గ్లోబల్ సెన్సేషన్' అనే క్యాప్షన్‌తో కూడిన ఫొటోను హోండా విడుదల చేసింది. అయితే, ఇందులో కొత్త సిటీ టీజర్‌ను మాత్రం ఉంచలేదు. కొత్త హోండా సిటీ కారును నెక్స్ట్ జనరేషన్ జాజ్ హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని తయారు చేశారు. కాగా.. కొత్త సిటీ ఆవిష్కరణ రోజున దీని ధరలు, స్పెసిఫికేషన్స్ మరియు వేరియంట్ల వివరాలను హోండా వెల్లడించనుంది.

2014 Honda City

ఇదిలా ఉండగా.. ఇప్పటికే కొందరు హోండా డీలర్లు అనధికారికంగా సరికొత్త హోండా సిటీ సెడాన్ కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు డీలర్లు కస్టమర్ల నుంచి రూ.50,000-1,00,000 అడ్వాన్సును స్వీకరించి, బుకింగ్‌లను అంగీకరిస్తున్నట్లు సమాచారం. హోండా కార్స్ ఇండియా దేశీయ విపణిలో ఇప్పటికే ప్రస్తుత సిటీ సెడాన్ ఉత్పత్తిని నిలిపి వేసింది.

హోండా నుంచి వస్తున్న ఈ కొత్త తరం సిటీ సెడాన్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 25, 2013న న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో కొత్త హోండా సిటీ సెడాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ మోడల్ గ్లోబల్ ఆవిష్కరణకు కూడా ఇదే వేదిక కానుంది.

Most Read Articles

English summary
Honda has confirmed the unveiling of the next gen City sedan in New Delhi on 25th November 2013. The new car - codenamed 2CT will be carried with the same 1.5L i-VTEC Petrol engine along with the all new 1.5L Diesel engine.
Story first published: Friday, November 15, 2013, 16:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X