లీటరుకు రూ.2 చొప్పున తగ్గిన పెట్రోల్ ధర

By Ravi

Petrol
పెట్రోల్ ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ఈనెల ఆరంభంలో లీటరు పెట్రోల్‌పై రూ.1.40 చొప్పున పెంపును విధించిన కంపెనీలు ఈసారి లీటరు పెట్రోల్‌పై రూ.2 చొప్పును తగ్గింపును (స్థానిక పన్నులు కలుపుకోకుండా) ప్రకటించాయి. చమురు కంపెనీలు గడచిన తొమ్మిది నెలల్లో పెట్రోల్ ధరను ఇంత గరిష్ట మొత్తంలో తగ్గించటం ఇదే మొదటిసారి. అయితే, డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

తగ్గిన పెట్రోల్ ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, పెట్రోల్ యొక్క సింగపూర్ బెంచ్‌మార్క్ ఎఫ్ఓబి (ఫ్రైట్ ఆన్ బోర్డ్) బ్యారెల్‌పై మార్చిన 1న 123.54 డాలర్లుగా ఉన్న ధర మార్చి 13 నాటికి 120.43 డాలర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో, చమురు కంపెనీలు కూడా భారత్‌లో పెట్రోల్ ధరలను తగ్గించాయి. తాజా తగ్గింపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి:

* ఢిల్లీ - రూ.68.34
* ముంబై - రూ.75.14
* కలకత్తా- రూ.75.84
* చెన్నై - రూ.71.41
* హైదరాబాద్ - రూ.74.59
* బెంగుళూరు - రూ.75.26

Most Read Articles

English summary
Petrol price was slashed by Rs 2 per litre, excluding local taxes, with effect from Friday midnight. After the revision, the fuel will cost Rs. 68.34 per litre in Delhi, Rs. 75.14 per litre in Mumbai, Rs. 71.41 per litre in Chennai, Rs. 75.84 per litre in Kolkata, Rs. 74.59 per litre in Hyderabad and Rs. 75.26 per litre in Bangalore, according to an IndianOil press release.
Story first published: Saturday, March 16, 2013, 9:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X