జులైలో 7.40 శాతం తగ్గిన ప్యాసింజర్ కార్ల అమ్మకాలు

By Ravi

Car Sales Down
వరుసగా గడచిన తొమ్మిది నెలలుగా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం గడచిన జులై నెలలో కార్ల అమ్మకాలు ఏకంగా 7.4 శాతం క్షీణిచాయి. గడచిన సంవత్సరంలో జులై నెలలో 1,41,646 యూనిట్లుగా ఉన్న కార్ల అమ్మకాలు ఈ సంవత్సరం జులై నెలలో 1,31,163 యూనిట్లకు పడిపోయాయి.

గడచిన కొద్ది నెలలుగా రుణాత్మక వృద్ధి చూస్తున్నామని, ఇది ఆటోమొబైల్ పరిశ్రమకు అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ అన్నారు. భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాల అమ్మకాలు తగ్గడం వరుసగా 17వ నెల అని అలాగే, మోటార్‌సైకిళ్లు, మొత్తం వాహనాల అమ్మకాలు పడిపోవడం కూడా ఇది వరుసగా 6వ నెల అని ఆయన తెలిపారు.

అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎమ్) తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయని మాధుర్ చెప్పారు. ఆటోమొబైల్ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలను అందించాలని గతంలో ప్రభుత్వాన్ని కోరామని, ఈ ప్యాకేజీలో భాగంగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని, గత ఏడాది మే నుంచి ప్రభుత్వపరంగా కొత్త వాహనాల కొనుగోళ్లపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని కోరామని ఆయన తెలిపారు.

సియామ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం, గడచిన జులై నెలలో మొత్తం వాణిజ్య వాహనాల అమ్మకాలు 65,008 యూనిట్ల నుంచి 55,301 యూనిట్లకు పడిపోయి 15 శాతం క్షీణించాయి. భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాల అమ్మకాలు 20 శాతం తగ్గాయి. కాగా జులై నెలలో మొత్తం వాహన అమ్మకాలు 14,45,112 యూనిట్ల నుంచి 14,15,102 యూనిట్లకు తగ్గి 2 శాతం క్షీణతను నమోదు చేశాయి.

Most Read Articles

English summary
Sales of domestic passenger car segment fell 7.40 percent in July, indicating a bearish consumer sentiment due to slow economic growth, high fuel and interest costs. Data furnished Monday by the Society of Indian Automobile Manufacturers (SIAM).
Story first published: Tuesday, August 13, 2013, 11:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X