ఇకపై కార్లు చల్లటి గాలితో కూడా నడుస్తాయ్..

By Ravi

'మండి'పోయే పెట్రోల్, డీజిల్ కార్లలో చల్లగా అలా షికారుకు వెళ్దామంటే, జేబులను నాలుగైదు సార్లు తడుముకోవాల్సిన పరిస్థితి. కానీ అసలు జేబు వంక చూసుకోకుండా, ఇంధనంపై పైసా ఖర్చు చేయకుండా కారులో షికారు చేసొస్తే ఎలా ఉంటుంది.. ఏంటీ పగటి కలలు.. అనుకుంటున్నారా..? అవునండి.. పెట్రోల్, డీజిల్‌తో పనిలేకుండా కేవలం చల్లటి గాలితో నడిచే కార్లను రూపొందించి చూపించాడు బ్రిటన్‌కు చెందిన ఓ పరిశోధకుడు.

బ్రిటన్‌కు చెందిన పీటర్ డెర్మాన్ కోల్డ్ ఎయిర్ (చల్లటి గాలి)తో నడిచే కారును తయారు చేశారు. తన వద్ద పనిచేయకుండా పడి ఉన్న 25 ఏళ్ల పురాతన వాక్స్‌హాల్ నోవా కారును మోడిఫై చేసి, ఆ కారును గాలితో నడిచేలా మార్పులు చేశాడు. ఇందు కోసం బాగా చల్లబరిచి, ద్రవరూపంలోకి మార్చిన గాలిని ఉపయోగించాడు. ఈ కారు గరిష్టంగా గంటకు 48 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

గాలి సాధారణంగా మైనస్ 190 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలోకి మారుతుంది. ఇలా ద్రవరూపంలోకి మారిన గాలిని ఇన్సులేటెడ్, వాక్యూమ్-సీల్డ్ కంటైనర్లలో స్టోర్ చేసుకోవచ్చు. ఈవిధంగా స్టోర్ చేసుకున్న గాలిని, సన్నటి గొట్టంతో వదలటం ద్వారా కారును ముందుకు నడపవచ్చు. ద్రవరూపంలో ఉన్న గాలిని వేడి చేస్తే అది వ్యాకోచించి ఇంజన్ పనిచేయటం ప్రారంభిస్తుంది.

తాను రూపొందించిన ఈ కారు వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని మరియు ఇది అత్యంత చవకైనదని పీటర్ తెలిపారు. ఈ కారును మరింత మెరుగుపరచే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ టెక్నాలజీ మనకు కూడా అందుబాటులోకి వస్తే బాగుంటుంది కదూ..!

చల్ల గాలితో నడిచే కారు

చల్ల గాలితో నడిచే కారు

చల్ల గాలితో నడిచే కారు

చల్ల గాలితో నడిచే కారు

చల్ల గాలితో నడిచే కారు

చల్ల గాలితో నడిచే కారు

చల్ల గాలితో నడిచే కారు

చల్ల గాలితో నడిచే కారు

చల్ల గాలితో నడిచే కారు

చల్ల గాలితో నడిచే కారు

Most Read Articles

English summary
A UK-based Peter Dearman has developed a car that runs only on cold air and it can reach speeds of up to 48 km per hour. Peter Dearman has modified his a 25-year-old Vauxhall Nova to run on nothing but air.
Story first published: Tuesday, March 19, 2013, 11:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X