స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

By Ravi

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. డీలరు కమిషన్‌లో పెంపు కారణంగా పెట్రోల్ ధరలను పెంచారు. డీలర్లకు ఇవ్వాల్సిన కమిషన్ పెరగటంతో ఆ భారాన్ని నేరుగా వినియోగదారులపై మోపారు. లీటరు పెట్రోల్‌పై 41 పైసలు, డీజిల్‌పై 10 పైసలు చొప్పున (స్థానిక పన్నులు కలుపుకోకుండా) పెంచారు. పెరిగిన ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రతినెలా 50 పైసల చొప్పున పెరుగుతున్న డీజిల్ ధరలకు మరో రెండు నెలల్లోనే పూర్తిగా స్వేచ్ఛ (డీరెగ్యులేట్) కల్పిస్తామనికల్పిస్తామని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడించారు. డీజిల్ విక్రయాలపై ఆదాయ నష్టం లీటరుకు రూ.8-9 మేర ఉంటోంది. ఇదే గనుక జరిగితే మరో రెండు నెలల్లో డీజిల్ ధర ఒక్క సారిగా రూ.10 వరకు పెరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

సబ్సిడి ధరకే డీజిల్‌ను విక్రయించడం వలం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసి), భారత్ పెట్రోలియం (బిపిసిపిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ (హెచ్‌పిసిఎల్) వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ప్రథమార్థంలో రూ.60,907 కోట్లు నష్టపోయినట్లు సమాచారం. మరికొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, ఇంధన ధరలు పెంచితే, ఇక కాంగ్రెస్ సర్కారు సంగతి అంతే సంగతులు అంటున్నారు రాజకీయ వేత్తలు.

Petrol Price Hike
Most Read Articles

English summary
Petrol price was on Friday hiked by 41 paise a litre following the government's decision to raise commission paid to petrol pump dealers and firming global oil rates.
Story first published: Saturday, December 21, 2013, 11:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X