భారత్‌లో రెండేళ్లు పూర్తి చేసుకున్న పోలారిస్; RZR XP 900 విడుదల

By Ravi

ఆఫ్-రోడ్, ఆల్-టెర్రైన్ వాహనాల తయారీలో ప్రపంచ అగ్రగామి అయిన పోలారిస్ ఇండస్ట్రీస్‌కు చెందిన భారతీయ అనుబంధం సంస్థ పోలారిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్లోకి ప్రవేశించి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, పోలారిస్ తమ సరికొత్త ఆఫర్-రోడ్ వాహనం పోలారిస్ ఆర్‍జెడ్ఆప్ ఎక్స్‌‌పి 900ను హైదరాబాద్‌లోని రామోజి ఫిల్మ్ సిటీలో విడుదల చేసింది.

పోలారిస్ ఇండియా రెండవ వార్షికోత్స వేడుకల్లో పోలారిస్ డీలర్లు, పోలారిస్ రైడర్స్ స్టాప్, పోలారిస్ ఎక్స్‌పీరియెన్స్ జోన్ బృందాలు పాల్గొన్నారు. భారత్‌లో పోలారిస్ బ్రాండ్‌‌ను ప్రవేశపెట్టిన తర్వాత, ఏటివి సెగ్మెంట్లో ఇది మార్కెట్ లీడర్‌‌గా నిలిచిందని, తమ అన్ని ఉత్పత్తులకు మంచి స్పందన లభించిందని పోలారిస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ దూబే అన్నారు.

RZR XP 900

పోలాసిర్ ఇండియా విడుదల చేసిన ఆర్‌జెడ్ఆర్ ఎక్స్‌పి 900 ఆల్-టెర్రైన్ వెహికల్ (ఏటివి) పోలారిస్ ప్రోస్టార్ 900, డ్యూయెల్ ఓవర్‌హెడ్ క్యామ్స్ (డిఓహెచ్‌సి), 4-వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్లో పోలారిస్ ఆర్‌జెడ్ఆర్ ఎక్స్‌పి 900 ధర రూ.24.50 లక్షలుగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పోలారిస్ డీలర్‌షిప్‌లలో ఇది లభ్యమవుతుంది.
Most Read Articles

English summary
Polaris India Pvt Ltd, a wholly owned subsidiary of Polaris Industries Inc., the world leader in off-road and All-Terrain vehicles today completed two years of its presence in the Indian market. On the occasion of its 2nd anniversary, Polaris launched the RZR XP 900 at the Ramoji Film City, Hyderabad.
Story first published: Saturday, August 24, 2013, 15:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X