నానో అమ్మకాలు బలహీనం; ఉత్పత్తిలో 80 శాతం కోత

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన కారుగా రికార్డు సృష్టించిన 'టాటా నానో' ఇప్పుడు మళ్లీ కష్టాలను ఎదుర్కుంటోంది. గడచిన కొద్ది నెలలుగా టాటా నానో అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ కారు డిమాండుకు మించి ఉత్పత్తి ఉండటంతో టాటా మోటార్స్ స్టాక్ యార్డులో అలాగే డీలర్ల గోడౌన్లలో నానో కార్లు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి.

నానో కార్లను స్టాక్ చేసుకునేందుకు కూడా సనంద్ ప్లాంటులో స్థలం లేకపోవటంతో టాటా మోటార్స్ తమ నానో ఉత్పత్తి ఏకంగా 80 శాతానికి తగ్గించి వేసింది. గుజరాత్‌లోని సనంద్ ప్లాంటులో కేవలం టాటా నానో కారు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం ఈ ప్లాంటులో 20 శాతం మాత్రమే నానో కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంటులో ఇప్పటికే 14,000 నానో కార్లు స్టాక్ ఉన్నట్లు సమాచారం.

గడచిన రెండు నెలల్లో టాటా నానో కార్ల అమ్మకాలు నెలకు 1500 యూనిట్లకు పడిపోయాయి. సనంద్ ప్లాంటులో నెలకు 24,000 నానో కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఇదే సమయంలో సగటున నెలకు 3000 యూనిట్ల కంటే ఎక్కువ నానో కార్లు అమ్ముడుపోవటం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ తమ సనంద్ ప్లాంటులో ఈ ప్రజల కారు ఉత్పత్తిని భారీగా తగ్గించింది.

ఇదిలా ఉండగా, టాటా నానోలో ఓ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది మధ్య భాగంలో ఇది మార్కెట్లో అందుబాటలోకి వచ్చే అవకాశాలున్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా కొద్దిపాటి మార్పులు చేర్పులను కొత్త నానోలో ఊహించవచ్చు. మరి ఈ అప్‌గ్రేడెడ్ నానో అయినా టాటా మోటార్స్‌ను ఆదుకుంటుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

Tata Nano
Most Read Articles

English summary
Due to weak sales of Nano, Tata Motors has slashed the world’s cheapest car production at its Sanand plant by 80%. According to sources, Tata Motors has over 14,000 Nano in stock currently at their plant in Sanand.
Story first published: Tuesday, March 19, 2013, 17:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X