అక్టోబర్ నుంచి భారత రోడ్లపై పరుగు పెట్టనున్న క్వాడ్రిసైకిళ్లు

By Ravi

బజాజ్ ఆటో తమ ఆర్ఈ6 క్వాడ్రిసైకిల్ (నాలుగు చక్రాల వాహనం)ను మార్కెట్లో విడుదల చేసేందుకు సర్వత్రా సిద్ధంగా ఉన్నప్పటికీ, ఈ సెగ్మెంట్ (క్వాడ్రిసైకిల్ సెగ్మెంట్) పాలసీ గురించి భారత ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన వెల్లడించలేదు. కాగా.. తాజా అప్‌డేట్ప్రకారం, సెంట్రల్ మోటార్ వెహికల్స్ రెగ్యులేషన్ (సిఎమ్‌విఆర్)లో క్వాడ్రిసైకిల్స్ అనే కొత్త విభాగాన్ని చేర్చి, తగిన మార్పులు చేయడానికి భారత ప్రభుత్వ న్యాయశాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

ఈ మార్పుకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను అతిత్వరలోనే వెల్లడించనున్నారు. రానున్న అక్టోబర్ 2013 నెల నుంచి ఈ క్వాడ్రిసైకిళ్లు భారత రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఈ విభాగం ద్వారా లబ్ధి పొందనున్న కంపెనీల్లో మొట్టమొదటి బజాజ్ ఆటో. భారతదేశంలో క్వాడ్రిసైకిల్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పాటించాల్సిన నిబంధనల గురించి, వివిధ పరామితుల గురించి ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.


గూడ్స్ (రవాణా), ప్యాసింజర్ క్యారీయర్ వెర్షన్ క్వాడ్రిసైకిళ్లు రెండింటినీ కూడా భారత రోడ్లపై అనుమతించనున్నారు. ప్యాసింజర్లను తీసుకు వెళ్లే క్వాడ్రిసైకిళ్ల బరువు 450 కిలోగ్రాములు, గూడ్స్ క్యారీయర్ క్వాడ్రిసైకిళ్ల బరువు 550 కిలోగ్రాములు ఉండాలి. ఈ తరహా వాహనాలను క్వాడ్రిసైకిళ్లని సులువుగా గుర్తించేందుకు గాను, ఇలాంటి అన్ని వాహనాల ముందు భాగంలో 'Q' అనే అక్షరాన్ని ఉంచాల్సి ఉంటుంది. వీటి గరిష్ట వేగాన్ని గంటకు 70 కిలోమీటర్లకు నియంత్రిస్తారు. ప్యాసింజర్ క్యారీయర్ వెర్షన్ 3+1 సీటింగ్‌తోను (డ్రైవర్ + 3 ప్యాసింజర్స్), గూడ్స్ క్యారీయర్ వెర్షన్ 1+1 సీటింగ్ (డ్రైవర్ + కో ప్యాసింజర్) డిజైన్‌ను కలిగి ఉండాలి. ఈ పాలసీలో మరిన్ని నిబంధలను పేర్కొనే అవకాశం ఉంది.

ఇక ఈ సెగ్మెంట్లో బజాజ్ ఆఫర్ చేయనున్న ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్ విషయానికి వస్తే..
బజాజ్ ఆటో తమ ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను తొలిసారిగా గడచిన సంవత్సరంలో జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ప్రస్తుతం కంపెనీ ఈ బజాజ్ ఆర్ఈ60 ఫోర్ వీలర్‌ను తమ ఔరంగాబాద్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే కాకుండా, సీఎన్‌జీ మరియు ఎల్‌పీజీ వెర్షన్లలో కూడా విడుదల కానుంది. సీఎన్‌జీ వెర్షన్ కేజీకి 35-37 కి.మీ. మైలేజీని, ఎల్‌పీజీ వెర్షన్ లీటరుకు 30 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.


బజాజ్ ఆర్ఈ60 కారు ఫీచర్లు:
  • 200సీసీ పెట్రోల్ ఇంజన్
  • సిటీ ట్రాఫిక్‌లకు, రోడ్లకు చక్కగా సరిపోతుంది.
  • గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.
  • ప్రకృతి సాన్నిహిత్యమైనది (ఎకో-ఫ్రెండ్లీ)
  • ఫోర్ సీటర్ (నలుగురు ప్రయాణికులు సులువుగా ప్రయాణించవచ్చు)
  • కారు పొడవు x వెడల్పు x ఎత్తు : 2752 మి.మీ. x 1312 మి.మీ. x 1650 మి.మీ.
  • కారు మొత్తం బరువు: 400 కేజీలు
  • కనీస టర్నింగ్ రేడియస్ - 3.5 మీటర్లు
  • లగేజ్ (బూట్) స్పేస్ - 44 లీటర్లు
  • అంచనా ధర - రూ.1 లక్ష నుండి రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)
Most Read Articles

English summary
Fresh update about the introduction of Quadricycle segment in India has emerged. According to a report on TOI, the government has accepted to amend the Central Motor Vehicles Regulation to allow the introduction of Quadricycles and the revised rules & regulations will come into effect by October 13. The remaining time see wrinkles being ironed out and final changes being made.
Story first published: Monday, August 5, 2013, 16:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X