వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు

Car Loans
పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బిఐ) మంగళవారం వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకులు పోటీ పడి మరి వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ తాజా పరిణామంతో వాహన రుణాలపై వడ్డీ రేట్లు స్వల్పంగా దిగొస్తున్నాయి.

హెచ్‌డిఎఫ్‌సి ఆటో లోన్స్ చీప్..
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి ఆటోమొబైల్‌ వాహనాల రుణాలపై వడ్డీరేట్లను 0.5 శాతం వరకూ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కార్ల రుణాలపై 0.25 శాతం, మోటార్‌‌బైక్‌ల రుణాలపై 0.5 శాతం వడ్డీరేట్లు తగ్గుతాయని హెచ్‌డిఎఫ్‌సి పేర్కొంది. ఈ తాజా తగ్గింపు శుక్రవారం (ఫిబ్రవరి 1, 2013) నుంచి అమల్లోకి వస్తుందని సదరు బ్యాంక్ వివరించింది.

ఎస్‌బిఐ వడ్డీ రేట్ల తగ్గింపు..
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) కూడా తమ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్‌బిఐ నిర్ణయం తీసుకోవటంతో తమ బ్యాంక్ బేస్ రేటు 9.75 శాతం నుంచి 9.70 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్‌బిఐ పేర్కొంది. దీంతో ఎస్‌బిఐ అందిస్తున్న వాహన రుణాలపై వడ్డీ రేటు స్వల్పంగా తగ్గనుంది. రుణాలపై ఎస్‌బిఐ ఆఫర్ చేయనున్న వడ్డీ రేట్ల తగ్గింపు ఫిబ్రవరి 4, 2013 నుంచి అమల్లోకి రానుంది.

వడ్డీ రేట్ల తగ్గింపు బాటలో ఇతర బ్యాంక్‌లు
ఆర్‌బిఐ నిర్ణయం తర్వాత ఐడిబిఐ బ్యాంక్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌, రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌‌లు తమ వడ్డీ రేట్లను తగ్గించగా, ఇదే బాటలో మరిన్ని ఇతర బ్యాంకులు ఆఫర్ చేయనున్న రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఆర్‌బిఐ ఏం చేసింది..?
గత మంగళవారం భారతీయ రిజర్వు బ్యాంక్ నిర్వహించిన ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో తొమ్మిది నెలల అనంతరం వడ్డీరేట్లు సవరించింది. స్వల్పకాలిక కీలక వడ్డీరేట్లు 0.25 శాతం తగ్గించింది. వ్యవస్థలో ద్రవ్యలభ్యతకు ఇబ్బంది కలుగకుండా 18,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్‌బిఐ నిర్ణయించింది. దీనివలన వివిధ బ్యాంకులు ఆఫర్ చేయనున్న గృహ, వాహన, కార్పోరేట్ రుణాలు తగ్గుముఖం పట్టనున్నాయి. మరి ఈ తాజా నిర్ణయంతో కార్ల అమ్మకాలు పెరుగుతాయో లేదో చూడాల్సి ఉంది.

Most Read Articles

English summary
Taking a cue from RBI's rate cut on Tuesday, public and private sector banks are reducing their interest rates on auto loans. Leading private sector bank HDFC Bank has decided to slash auto loan rates by upto 0.5%. Soon other banks will also cut their interest rates on auto loans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X