ఆర్ఈ60 నానో మాదిరిగా 'చీప్ కారు' కాదు: బజాజ్

By Ravi

బజాజ్ ఆటో నుంచి త్వరలో మార్కెట్లోకి రానున్న ఫోర్-వీలర్ 'బజాజ్ ఆర్ఈ60' విషయంలో టాటా మోటార్స్‌కు, బజాజ్ ఆటోకు మాటల యుద్ధం ముదురుతోంది. ఈ ఫోర్ వీలర్‌ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రకటించినున్న నేపథ్యంలో, సేఫ్టీ అంశాన్ని, పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఫోర్ వీలర్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి అనుమతూలు మంజూరు చేయకూడదని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ స్లిమ్ వ్యాఖ్యానించారు.

దీనిపై బజాజ్ ఆటో స్పందిస్తూ, టాటా నానో మాదిరిగా తమ ఫోర్-వీల్ 'చీప్ కారు' కాదని పేర్కొంది. టాటా నానో కారులో తక్కువ ధర తప్పితే మరేమి లేదని, ఇటీవలి గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయని బజాజ్ ఆటో ప్రతినిధి తెలిపారు. వాస్తవానికి బజాజ్ ఆర్ఈ60 ప్యాసింజర్ కారు కాదు. ఇదొక 'క్వాడ్రిసైకిల్' (నాలుగు చక్రాలు కలిగిన వాహనం). ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాంప్రదాయ ఆటోరిక్షాలకు (త్రీవీలర్) అడ్వాన్స్‌డ్ వెర్షన్ అన్నమాట.

మరి ఈ విషయంలో టాటా-బజాజ్ మాటల యుద్ధం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే. బజాజ్ ఆటో తమ ఔరంగాబాద్ ప్లాంటులో ఈ ఆర్ఈ60 ఫోర్ వీలర్‌ను ఉత్పత్తి చేయానుంది. ప్రారంభంలో భాగంగా కేవలం 5,000 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని, ఈ మోడల్‌కు లభించే స్పందనను బట్టి తర్వాతి ఉత్పత్తి ఉంటుందని కంపెనీ తెలిపింది. బజాజ్ ఆర్ఈ-60లో రెండు వేరియంట్ల (ఒకటి కమర్షియల్ వెర్షన్‌, మరొకటి పర్సనలైజ్డ్ వెర్షన్‌)లో లభ్యం కానుంది.

RE60 Is Not Cheap Car, Says Bajaj Auto
Most Read Articles

English summary
A day after Tata Motors Managing Director Karl Slym questioned the need for quadricycles, Pune-based Bajaj Auto, which is pioneering the quadricycle project, said its RE60 wasn’t a low-cost car.
Story first published: Saturday, April 27, 2013, 12:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X