జనవరి 2014 నుంచి పెరగనున్న రెనో కార్ల ధరలు

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో, తమ జపాన్ భాగస్వామి నిస్సాన్ బాటలోనే పయనించేందుకు మొగ్గుచూపింది. వచ్చే నెల నుంచి దాదాపు అన్ని కార్ల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్న నేపథ్యంలో, తామెందుకు పెంచకూదనుకుందో ఏమో గానీ, రెనో ఇండియా కూడా జనవరి 2014 నుంచి దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించుకుంది.

పెరుగుతున్న రేట్లు, ఉత్పాదక వ్యయం తదిత సూక్ష ఆర్థిక కారణాల దృష్ట్యా రెనో ఇండియా జనవరిలో తమ అన్ని ఉత్పత్తుల ధరలను పెంచుతుందని ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) సుమిత్ సాహ్నే ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏయే మోడల్‌పై ఎంత మేర ధరలను పెంచే విషయాన్ని తర్వాత వెల్లడిస్తామని, ఈ పెంపు పరిశ్రమ ప్రమాణాలకు లోబడి ఉంటుందని ఆయన అన్నారు.

Renault India To Increase Car Prices From January 2014

ప్రస్తుతం రెనో ఇండియా భారత మార్కెట్లో పల్స్ హ్యాచ్‌బ్యాక్, స్కాలా మిడ్-సైజ్ సెడాన్, ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్, డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, కొలియోస్ ప్రీమియం ఎస్‌యూవీలను విక్రయిస్తోంది. దేశీయ విపణిలో వీటి ధరలు రూ.4.48 లక్షల నుంచి రూ.23.99 లక్షల రేంజ్‌లో (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.

కాగా.. ఇప్పటికే జనవరి 2014 కార్ల ధరలను పెంచనున్నట్లు నిస్సాన్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా కంపెనీలతో పాటుగా బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, ఆడి ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా కంపెనీలు కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసినదే.

Most Read Articles

English summary
French carmaker Renault India has announced price hike of its cars from next month to offset the impact of high input costs. Currently Renault India sells five models in India. Prices of Renault vehicles range from Rs 4.48 lakh to Rs 23.99 lakh (ex-showroom Delhi).
Story first published: Wednesday, December 11, 2013, 16:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X