సైలెంట్‌గా స్కాలా బేస్ వేరియంట్‌ను లాంచ్ చేసిన రెనో ఇండియా

By Ravi

Renault Scala RxE
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెన్ ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ రెనో స్కాలా (నిస్సాన్ సన్నీకి రీబ్యాడ్జ్ వెర్షన్)లో మరొక బేస్ డీజిల్ వేరియంట్‌‌ను సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ బేస్ డీజిల్ వేరియంట్ రెనో స్కాలా ఆర్ఎక్స్ఈ ధర రూ.8.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

రెనో ఇండియా అందిస్తున్న మిడిల్ వేరియంట్ స్కాలా ఆర్ఎక్స్ఎల్ ధర కన్నా ఈ బేస్ వేరియంట్ స్కాలా ఆర్ఎక్స్ఈ ధర దాదాపు రూ.50,000 తక్కువగా ఉంది. బేస్ వేరియంట్ స్కాలాకు సంబంధించిన ఫీచర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మిడిల్ వేరియంట్‌తో పోల్చుకుంటే ఈ బేస్ వేరియంట్లో ఫీచర్లు తగ్గే ఆస్కారం ఉంది.

అయితే, ఈ బేస్ డీజిల్ వేరియంట్ రెనో స్కాలాలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో అదే 1.5లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

రెనో స్కాలా ఆర్ఎక్స్ఈ బేస్ డీజిల్ వేరియంట్‌లో కేవలం డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, కేవలం ప్యాసింజర్‌కు మాత్రమే వ్యానిటీ మిర్రర్, లోపలి వైపు నుంచి సర్దుబాటు చేసుకునే అవుట్ సైడ్ మిర్రర్స్ (మ్యాన్యువల్), బ్లాక్ ఇంటీరియర్స్ వంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా. ఇందులో రియర్ డిఫాగ్గర్ ఉండే అవకాశం లేదు. ఈ లేటెస్ట్ వేరియంట్ స్కాలాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
Without any fanfare Renault India has launched a new base variant of the Scala sedan. The new Scala RxE diesel variant is priced at INR 8.29 lakhs, which is Rs 50,000 cheaper than the now mid variant, Scala RxL.
Story first published: Tuesday, May 28, 2013, 19:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X