మారుతి ఆల్టో 800కు పోటీగా రెనో-నిస్సాన్ 800సీసీ కారు

By Ravi

డాట్సన్ గో కారు విడుదలతో నిస్సాన్ తక్కువ ధర కలిగిన కార్లను ప్రవేశపెట్టి, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న భారీ మార్కెట్ వాటాను దక్కించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. లో కాస్ట్ కార్ సెగ్మెంట్లో ఉన్న అవకాశాలను అప్పణంగా కాజేసేందుకు నిస్సాన్ భారీ ప్రణాళికలే రూపొందిస్తుంది. కేవలం డాట్సన్ గో కారు విడుదలతో ఊరుకోకుండా, ప్రస్తుతం భారత చిన్న కార్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న మారుతి ఆల్టో 800ను ఢీకొట్టేందుకు మరొక కాంపాక్ట్ కారును డాట్సన్ బ్రాండ్ క్రింద నిస్సాన్ అభివృద్ధి చేయనుంది.

రానున్న మూడేళ్లలో 10 కొత్త కార్లను విడుదల చేస్తామని నిస్సాన్ పేర్కొంది. అందులో 3 కార్లు డాట్సన్ బ్రాండ్‌ నుంచి రానున్నాయి. వీటికి అధనంగా ఫ్రెంచ్, జపాన్ భాగస్వాములైన రెనో-నిస్సాన్ బడ్జెట్ కార్ల ఉత్పత్తి దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ రెండు సంస్థలు ప్రస్తుతం ఓ 800సీసీ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలోని ఆర్ అండ్ డి కేంద్రంలో ఈ చిన్న ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మారుతి సుజుకి ఆల్టో 800 వంటి చిన్న కార్లను సవాలు చేసేందుకే ఈ జేవీ కాంపాక్ట్ ఇంజన్‌ను డెవలప్ చేస్తున్నాయి.

Renault Nissan Working On Alto 800 Competitor
Most Read Articles

English summary
Another update concerning the small car onslaught the Renault-Nissan Alliance has come from Wall Street Journal, which has received a formal confirmation about an 800cc engine being developed in the Chennai R&D center. This India specific 0.8 liter petrol unit will power a super mini that will be a direct competitor to Maruti Suzuki Alto 800 and Hyundai Eon.
Story first published: Saturday, July 20, 2013, 17:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X