భారత్‌లో పల్స్, స్కాలా కార్లను రీకాల్ చేసిన రెనో

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్స్ మైక్రా హ్యాచ్‌బ్యాక్, నిస్సాన్ సెడాన్లలో మాస్టర్ బ్రేక్ సిలిండర్ల సమస్య కారణంగా ఈ మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. మొత్తం 22,188 మైక్రా, సన్నీ కార్లను నిస్సాన్ రీకాల్ చేసింది. కాగా తాజాగా మైక్రా, సన్నీ ప్లాట్‌ఫామ్‌లను షేర్ చేసుకొని రెనో అభివృద్ధి చేస్తున్న పల్స్, స్కాలా కార్లలో కూడా ఇదే సమస్యను గుర్తించారు.

ఈ రెండు కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల్లో ఒకేరమైన విడిభాగాలను, టెక్నాలజీలను ఉపయోగిస్తున్నందున, ఈ సమస్య తమ పల్స్, స్కాలా కార్లలో కూడా గుర్తించినట్లు రెనో ఇండియా పేర్కొంది. మొత్తం 7,016 పల్స్, స్కాలా కార్లలో ఈ సమస్యను గుర్తించామని, ఈ సమస్య గురించి కస్టమర్లకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నామని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది.

రెనో ఇండియా డీలర్లు ఈ మాస్టర్ బ్రేక్ సిలిండర్‌ను కస్టమర్ నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా, ఉచితంగా రీప్లేస్ చేస్తారని కంపెనీ వెల్లడించింది. వినియోగదారులకు పూర్తిస్థాయి భద్రతతో కూడిన ఉత్పత్తులను మరియు సంతృప్తితో కూడిన సర్వీస్‌ను అందించడానికి తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని, ఈ దిశలో భాగంగానే లోపపూరిత మాస్టర్ బ్రేక్ సిలిండర్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తున్నామని రెనో తెలిపింది.

Renault Pulse Recall
Most Read Articles

English summary
French carmaker, Renault India has recalled 7,016 cars including Pulse hatchback and Scala sedan models in India. The reason for the recall is the faulty master brake cylinder in these vehicles.
Story first published: Wednesday, May 29, 2013, 12:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X