జూన్‌లో 8 రెట్లు పెరిగిన రెనో ఇండియా అమ్మకాలు

By Ravi

Renault Duster
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో డస్టర్ అద్భుతాలు చేస్తోంది. ఈ మోడల్ కంపెనీ రాతనే మార్చేసింది. దేశీయ విపణిలో ఇది హాట్ కేకుల్లా అమ్మడుపోతూ, కంపెనీ లభాలు తెచ్చిపెడుతోంది. గడచిన జూన్ నెల అమ్మకాలే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. జూన్ 2013లో రెనో ఇండియా మొత్తం 6007 వాహనాలను విక్రయించింది.

గడచిన సంవత్సరంలో ఇదే నెల అమ్మకాలతో పోల్చుకుంటే, ఇవి ఎనిమిది రెట్లు అధికం. జూన్ 2012లో రెనో ఇండియా విక్రయించిన మొత్తం వాహనాలు 787 యూనిట్లు మాత్రమే. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల్లోను రెనో బ్రాండ్‌ వృద్ధిని సాధిస్తోందని, భారతీయ వినియోగదారులు తమ బ్రాండ్‌ను చక్కగా ఆదరిస్తున్నారని రెనో ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) సుమిత్ దూబే తెలిపారు.

కాగా.. జూన్ 2013లో రెనో ఇండియా మొత్తం 6007 వాహనాలను విక్రయిస్తే, అందులో 4523 యూనిట్ల డస్టర్ అమ్మకాలే ఉండటం విశేషం. ఇందులో 772 స్కాలా సెడాన్లు, 497 పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లు, 215 ఫ్లూయెన్స్ ప్రీమయం సెడాన్లు ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Most Read Articles

English summary
Renault India said its sales surged nearly eight-fold to 6,007 units in June this year, amidst challenging market conditions. The company had sold 787 units sold in June 2012. Out of the 6,007 units sold by the company in June, Duster accounted for 4,523 units, the Scala 772 units, Pulse 497 units, and Fluence 215 units, the company said.
Story first published: Wednesday, July 3, 2013, 12:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X