ఆగస్టు 19న భారత్‌లో విడుదల కానున్న రోల్స్ రాయిస్ వ్రైత్

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ గడచిన మార్చ్ నెలలో జరిగిన 83వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించిన పెర్ఫామెన్స్ కారు రోల్స్ రాయిస్ వ్రైత్ (Rolls Royce Wraith)ను ఆగస్ట్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ గత కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు ఈ హై-పెర్ఫామెన్స్ లగ్జరీ ఈనెల 19న భారత్‌లో విడుదల కానుంది.

రోల్స్ రాయిస్ వ్రైత్ ఈ బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ నుంచి లభ్యం కానున్న అత్యంత శక్తివంతమైన కారు. రోల్స్ రాయిస్ నుండి అత్యంత పాపులర్ అయిన లగ్జరీ సెడాన్ 'ఘోస్ట్' ప్లాట్‌‌ఫామ్ ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ 'వ్రైత్'ను అభివృద్ధి చేసింది. రోల్స్ రాయిస్ వ్రైత్‌లో 6.6 లీటర్, వి12, ట్విన్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 624 పిఎస్‌ల శక్తిని, 800ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.2 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

రోల్స్ రాయిస్ వ్రైత్ గరిష్ట వేగాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, రోల్స్ రాయిస్ ఇప్పటి వరకూ విడుదల చేసిన కార్లలో కెల్లా ఇదే అత్యంత వేగవంతమైన కారు అనే విషయాన్ని మాత్రం కంపెనీ తెలిపింది. దీని ధర 3,20,000 డాలర్లు లేదా రూ.1.75 కోట్లు (పన్నులు కలుపుకోకుండా) ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
British luxury carmaker Rolls Royce is all set to launch its high performance luxury car Wraith in India on 19th August. Wraith is powered by a 6.6L V12 twin turbo which generates max power of 624 PS and peak torque of 800 Nm, the Wraith comes with a 0-100 kmph acceleration time of 4.2 seconds.
Story first published: Wednesday, August 14, 2013, 9:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X