రూమరా లేక నిజమా? నిస్సాన్ ఇవాలియా ఉత్పత్తి బంద్

By Ravi

Nissan Evalia
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్, ఇటీవలే భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) 'ఇవాలియా' ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ప్రపంచ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన నిస్సాన్ ఇవాలియా దేశీయ విపణిలో మాత్రం ఆశించిన రీతిలో సక్సెస్‌ను సాధించలేకపోయింది. గడచిన కొద్ది నెలలుగా నిస్సాన్ ఇవాలియా అమ్మకాలు భారీగా తగ్గుతూ వచ్చాయి.

ఈ ఏడాది జనవరి నెలలో 257 యూనిట్లు, ఫిబ్రవరి నెలలో 147 యూనిట్లు, మార్చి నెలలో 346 యూనిట్లు, ఏప్రిల్ నెలలో 18 యూనిట్లు మరియు మే నెలలో 117 యూనిట్ల నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివిలు మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రత్యేకించి ఈ మోడల్ విషయంలో ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవటంతో మార్కెట్లో నిస్సాన్ ఇవాలియా స్టాక్ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది.

ఈ నేపథ్యంలో, డీలర్లు మరియు కంపెనీ స్టాక్ యార్డులలో నిస్సాన్ ఇవాలియా ఇన్వెంటరీని తగ్గించుకునేందుకు కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే, త్వరలోనే ఇవాలియా మరిన్న చేర్పులు సంతరించుకొని సరికొత్త లుక్ అండ్ ఫీల్‌తో రీలాంచ్ కావచ్చనే వార్తలు కూడా విపిస్తున్నాయి. అయితే, ఈ కొత్త ఇవాలియాలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న నిస్సాన్ ఇవాలియాలో 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1900 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్) కలిగిన నిస్సాన్ ఇవాలియా లీటర్ డీజిల్‌కు సుమారు 20 కి.మీ. మైలేజీనిస్తుంది.

Most Read Articles

English summary
According to a report on Team-BHP, Nissan has decided to pause production of the Evalia MPV. The reason behind this is to clear inventory build up, post which it is expected to receive a makeover.
Story first published: Monday, June 10, 2013, 15:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X