చెవర్లే సెయిల్ సెడాన్ టీజర్‌ను విడుదల చేసిన జిఎమ్

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న చెవర్లే సెయిల్ యూ-వీఏ హ్యాచ్‌బ్యాక్‍‌ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన చెవర్లే సెయిల్ సెడాన్ విడుదలకు సిద్ధమవుతోంది. కొత్త సంవత్సర కానుకగా కార్ ప్రియులను అలరించేందుకు జిఎమ్ ఇండియా ఈ కారును మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, జనరల్ మోటార్స్ ఇప్పటికే తమ చెవర్లే వెబ్‌సైట్‌లో సెయిల్ సెడాన్ విడుదలను తెలియజేస్తూ, ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. చెవర్లే సెయిల్ సెడాన్‌లో ఉండే విశిష్టమైన ఫీచర్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

* స్లీక్ స్టయిలిష్ లుక్స్:
రోడ్డుపై వెళ్తుంటే, అవతలి వాళ్ల తలలు తిప్పుకునేలా, హృదయాలను గెలుచుకునేలా చెవర్లె సెయిల్ సెడాన్‌ను డిజైన్ చేశారు. ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్, ఆకట్టుకునే ఇంటీరియర్స్ ఈ కారుకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

* విశాలమైన ఇంటీరియర్ స్పేస్:
సెయిల్‌లో ఉండే ఎక్సలెంట్ లెగ్ రూమ్, విశాలమైన బూట్ స్పేస్, రియర్ సీట్ ఆర్మ్‌‌రెస్ట్, స్మార్ట్ స్టోరేజ్ స్పేసెస్ వంటి ఫీచర్ల వలన ఇది విలాసవంతమైన కారు అనుభూతిని కల్పిస్తుంది.

* అధునాతన భద్రతా ఫీచర్లు:
సెయిల్‌లో ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పించేలా ఈ కారును తీర్చిదిద్దారు. ప్రమాద పరిస్థితులను తట్టుకునేలా 'సేఫ్ కేజ్' స్ట్రక్చర్‌తో దీనిని తయారు చేశారు. కారు వేగాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్స్, సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), ఎయిర్‌బ్యాగ్స్, ప్రీ-టెన్షనర్ సీట్ బెల్ట్స్, క్రంపల్ జోన్స్, కొలాప్సబల్ స్టీరింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

* సాటిలేని పెర్ఫామెన్స్:
చెవర్లే సెయిల్ యూ-వీఏ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన ఇంజన్లనే చెవర్లే సెయిల్ సెడాన్‌లోను ఉపయోగించనున్నారు. పెట్రోల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1.2 లీటర్ (1199సీసీ) స్మార్టెక్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1.3 లీటర్ (1248సీసీ) స్మార్టెక్ టర్బో-ఛార్జ్‌డ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.

* స్మార్ట్ ఫీచర్లు:
ఫోన్ కాల్స్ చేసుకునేందుకు, సంగీతం వినేందుకు వీలుగా బ్లూటూత్ కనెక్టివిటీ, విశిష్టమైన 3-5-3 అడ్వాంటేజ్ (3 ఏళ్లు/45,000 కి.మీ. చెవర్లే ప్రామిస్, 5 ఏళ్లు/1,50,000 కి.మీ. ఇంజన్, ట్రాన్సిమిషన్ వారంటీ, 3 ఏళ్లు/1,00,000 కి.మీ. వారంటీ)తో ఇది లభిస్తుంది.

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

కొత్త సంవత్సర కానుకగా కార్ ప్రియులను అలరించేందుకు జిఎమ్ ఇండియా ఈ కారును మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, జనరల్ మోటార్స్ ఇప్పటికే తమ చెవర్లే వెబ్‌సైట్‌లో సెయిల్ సెడాన్ విడుదలను తెలియజేస్తూ, ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

* స్లీక్ స్టయిలిష్ లుక్స్:

రోడ్డుపై వెళ్తుంటే, అవతలి వాళ్ల తలలు తిప్పుకునేలా, హృదయాలను గెలుచుకునేలా చెవర్లె సెయిల్ సెడాన్‌ను డిజైన్ చేశారు. ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్, ఆకట్టుకునే ఇంటీరియర్స్ ఈ కారుకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

* విశాలమైన ఇంటీరియర్ స్పేస్:

సెయిల్‌లో ఉండే ఎక్సలెంట్ లెగ్ రూమ్, విశాలమైన బూట్ స్పేస్, రియర్ సీట్ ఆర్మ్‌‌రెస్ట్, స్మార్ట్ స్టోరేజ్ స్పేసెస్ వంటి ఫీచర్ల వలన ఇది విలాసవంతమైన కారు అనుభూతిని కల్పిస్తుంది.

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

* అధునాతన భద్రతా ఫీచర్లు:

సెయిల్‌లో ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పించేలా ఈ కారును తీర్చిదిద్దారు. ప్రమాద పరిస్థితులను తట్టుకునేలా 'సేఫ్ కేజ్' స్ట్రక్చర్‌తో దీనిని తయారు చేశారు. కారు వేగాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్స్, సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), ఎయిర్‌బ్యాగ్స్, ప్రీ-టెన్షనర్ సీట్ బెల్ట్స్, క్రంపల్ జోన్స్, కొలాప్సబల్ స్టీరింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

* సాటిలేని పెర్ఫామెన్స్:

పెట్రోల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1.2 లీటర్ (1199సీసీ) స్మార్టెక్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1.3 లీటర్ (1248సీసీ) స్మార్టెక్ టర్బో-ఛార్జ్‌డ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

* స్మార్ట్ ఫీచర్లు:

ఫోన్ కాల్స్ చేసుకునేందుకు, సంగీతం వినేందుకు వీలుగా బ్లూటూత్ కనెక్టివిటీ, విశిష్టమైన 3-5-3 అడ్వాంటేజ్ (3 ఏళ్లు/45,000 కి.మీ. చెవర్లే ప్రామిస్, 5 ఏళ్లు/1,50,000 కి.మీ. ఇంజన్, ట్రాన్సిమిషన్ వారంటీ, 3 ఏళ్లు/1,00,000 కి.మీ. వారంటీ)తో ఇది లభిస్తుంది.

Most Read Articles

English summary
The Chevrolet Sail sedan is ready to hit the Indian roads soon. Genaral Motors India has already launched a special web page for Sail sedan in Chevrolet India's official website. It says that the upcoming car has Designed to turn heads and win the hearts, Excellent leg room, Generous boot space, Safe Cage structure for occupant safety. Few other details also available in their website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X