కార్ లోన్ కోసం శాలరీ లిమిట్ పెంచిన ఎస్‌బిఐ బ్యాంక్

By Ravi

కార్ లోన్ కావాలని ఫైనాన్షియర్ దగ్గరకు వెళ్తే, వారు అడిగే మొదటి ప్రశ్న, మీ జీతమెంత అని. ఇప్పుడు భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతుంది. అంతేకాదండోయ్.. కార్ లోన్ పొందాలంటే కనీసం సంవత్సరానికి ఆరు లక్షల రూపాయల ఆదాయం ఉండాలనే షరతు కూడా పెట్టింది.

ఏటా రూ.6 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారికే కార్ లోన్లను మంజూరు చేయాలని ఎస్‌బిఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, రుణం కోసం అర్హత నిబంధనల్లో మార్పులు చేసి, శాలరీ లిమిట్‌ను పెంచారు. అంతేకాదు, ప్రాసెసింగ్ ఫీజును కారు ధరలో 0.51 శాతం మేర పెంచారు. ఇలా చేయటానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణమేనని బ్యాంకు చెబుతుంటే, మార్కెట్ వర్గాలు మాత్రం ఆర్థిక వృద్ధిలో మందగమనం వల్లే బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగి ఖర్చులు కూడా అంతే భారీగా పెరిగిపోతున్నాయి, కానీ ఆదాయం మాత్రం పెరగటం లేదు. పెరిగిన పెట్రోల్ ధరలు, మెయింటినెన్స్, ఇన్సూరెన్స్ మరియు ఇతర ఖర్చులతో నెలకు కనీసం రూ.50,000 సంపాధించే కుటుంబాలకే ఫైనాన్సులో కారును కొనుగోలు చేసే శక్తి ఉంటుందని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు.

SBI Car Loan
Most Read Articles

Story first published: Tuesday, September 3, 2013, 12:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X