డీజిల్ ధర పెంపును స్వాగతించిన ఆటోమొబైల్ పరిశ్రమ

By Ravi

Diesel Price Hike
డీజిల్ ధరలో భారీ పెంపును ఆటోమొబైల్ పరిశ్రమ స్వాగతించింది. రానున్న పది నెలల్లో ప్రతి లీటరు డీజిల్‌పై నెలకు ఒక్క రూపాయి చొప్పున మొత్తం 10 నెలల కాలానికి రూ.10 పెంచాలన్న ప్రతిపాదనను భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) స్వాగతించింది. ఈ ప్రతిపాదన దీర్ఘ కాలంలో ఆటోమోటివ్ పరిశ్రమకు మరియు ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూర్చి పెడుతుందని సియామ్ అభిప్రాయపడింది. "డీజిల్ ధరలో ప్రతిపాదిత పెంపు అధికంగా ఉన్నప్పటికీ, సియామ్ ఇందుకు తమ మద్ధతును తెలుపుతుందోని, దశల వారీగా ఈ పెంపును చేపట్టినట్లయితే వినియోగదారులపై ఇది దుష్ప్రాభావం చూపబోదని" సియామ్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ పెంపు వలన స్వల్పకాలికంగా డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టవచ్చునని, అయితే ఇది దీర్ఘకాలంలో పరిశ్రమకు, ఆర్థికవ్యవస్థకు విభిన్న ప్రయోజనాలు చేకూర్చి పెడుతుందని సియామ్ తెలిపింది. గత వారంలో విడతల వారీగా డీజిల్ ధరను రానున్న 10 నెలల్లో రూ.10 మేర పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. పెట్రోలియం ఉత్పత్తుల్లో విడతల వారీగా పెంపు ఉంటుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా బలంగా వ్యాఖ్యానించారు.

చమురు కంపెనీలు వంట గ్యాస్, డీజిల్, కిరోసిసన్‌లను మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే విక్రయిస్తుండటంతో గడచిన సంవత్సరంలో సుమారు 1,67,000 కోట్ల ఆదాయ నష్టం వాటిళ్లనట్లు అంచనా. ఈ భారమంతా ప్రభుత్వం పైనే పడుతోంది. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో, పెట్రో మంట నుంచి తప్పించుకునేందుకు గాను, సర్కారు ఈ ప్రతిపాదనలను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.గడచిన సెప్టెంబర్ నెలలో డీజిల్ ధరలను ఒక్కసారిగా ప్రతి లీటరుపై రూ.5 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.47.15 లుగా ఉంది. ఈ ధరకు విక్రయిస్తున్నప్పటికీ ఆయిల్ కంపెనీలు ప్రతి లీటరు డీజిల్ విక్రయంపై రూ.9.28 నష్టపోతున్నట్లు పేర్కొన్నాయి.

Most Read Articles

English summary
Society of Indian Automobile Manufacturers (SIAM) has welcomed the central government's proposal to hike diesel price by Rs 10 per litre in the next 10 months. "Though the proposed price hike of diesel is quite steep, SIAM would support rationalising of the hike and insists that it has to be done in a manner that should not adversely affect consumers," SIAM said in a statement.
Story first published: Monday, January 7, 2013, 13:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X