స్కొడా ర్యాపిడ్ కోసం జీరో పర్సెంట్ ఫైనాన్స్ స్కీమ్

By Ravi

కొనుగోలుదారులను ఆకట్టుకున్న కార్ల తయారీదారులు వివిధ రకాల స్కీమ్‌లను పరిచయం చేస్తున్న సంగతి తెలిసినదే. ఇదే కోవలో, చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా తమ ర్యాపిడ్ సెడాన్ కోసం మరో సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ర్యాపిడ్ సెడాన్ గతంలో ఈఎమ్ఐ హాలిడే ఆఫర్ (కారును కొనుగోలు చేసిన 12 నెలల తర్వాతి నుంచి ఈఎమ్ఐ ప్రారంభం), 100 పర్సెంట్ ఫైనాన్స్ (కారు ధర మొత్తానికి రుణ సదుపాయం) వంటి ఆఫర్లను అందించిన స్కొడా ఇండియా, ఇప్పుడు అదే ర్యాపిడ్ కారు కోసం జీరో పర్సెంట్ ఇంట్రస్ట్ స్కీమ్‌ను పరిచయం చేసింది.

స్కొడా ఫైనాన్స్ ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ జీరో పర్సెంట్ స్కీమ్‌లో భాగంగా 36 నెలల కాల వ్యవధికి గాను, సున్నా శాతం వడ్డీ రేటు కంపెనీ రుణాన్ని అందిస్తోంది. ఇందులో నెలసరి వాయిదా రూ.17,167 వరకు ఉంటుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమేనని, షరతులు వర్తిస్తాయని కంపెనీ ప్రకటించింది. స్కొడా ర్యాపిడ్ జీరో పర్సెంట్ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత స్కొడా ఇండియా డీలరును సంప్రదించండి.


స్కొడా ర్యాపిడ్‌ విషయానికి వస్తే, ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6 లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5250 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పిల శక్తిని, 3800 ఆర్‌పిఎమ్ వద్ద 153 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6-లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ 4400 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పిల శక్తిని, 1500-2500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. దీని స్కొడా ర్యాపిడ్ సెడాన్ గరిష్ట వేగం గంటకు 183 కిలోమీటర్లు.

స్కొడా ర్యాపిడ్ టాప్-ఎండ్ వేరియంట్లో (ఎలిగాన్స్)లో ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు, వెనుక ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్, డ్రైవర్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ కండిషనింగ్, రియర్ ఏసి వెంట్స్, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, టిల్ట్ స్టీరింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సిడి/ఎఫ్ఎమ్/ఆక్స్-ఇన్/ఎస్‌డి కార్డ్ ఆప్షన్ కలిగిన మ్యూజిక్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ, ఫ్యాబ్రిక్ సీట్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇది సిల్వర్, వైట్, బీగీ, బ్లాక్, రెడ్ కలర్లలో ఇది లభ్యమవుతుంది.

Most Read Articles

Story first published: Tuesday, November 26, 2013, 12:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X