భారత మార్కెట్ కోసం సరికొత్త స్కొడా ఎస్‌యూవీ

By Ravi

చెక్ రిపబ్లికన్ కార్ కంపెనీ స్కొడాకు భారత మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీ సెగ్మెంట్లో పెద్దగా కలిసొచ్చినట్లు లేదు. ఈ సెగ్మెంట్లలో కంపెనీ ఆఫర్ చేసిన ఫ్యాబియా, యెటి మోడళ్లు కొనుగోలుదారులను ఆకట్టుకోవటం విఫలమయ్యాయనే చెప్పొచ్చు. కానీ, స్కొడా ఇటీవల విడుదల చేసిన ర్యాపిడ్, ఆక్టావియా సెడాన్లు మాత్రం ఫర్వాలేదనిపించాయి. సరే, ఇదంతా అటుంచి అసలు విషయానికి వస్తే, స్కొడా ఇప్పుడు ఓ ఫుల్ సైజ్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది.

యూకేకి చెందిన ఓ ఆంగ్ల పత్రకకు కంపెనీ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, అంత సజావుగా సాగితే 2016 నాటికి ఓ కొత్త స్కొడాను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్ విన్‌ఫ్రీడ్ వాలండ్ వెల్లడించారు.

VW Cross Blue

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్‌బ్లూ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని, స్కొడా తమ ఫుల్ సైజ్ ఎస్‌యూవీని అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. ఫోక్స్‌వ్యాగన్ క్రాస్‌బ్లూ 2015లో మార్కెట్లోకి రానుంది. ఈ రెండు మోడళ్లును కూడా కంపెనీ యొక్క పాపులర్ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు (ఆడి ఎస్‌యూవీలను కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు).

స్కొడా నుంచి రానున్న ఈ పెద్ద ఎస్‌యూవీ 4.6 మీటర్లను పొడవుతో, 5-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో, ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ మోడల్‌ను ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీకి ఎగువన ప్రవేశపెట్టనున్నారు. ఇది ఈ సెగ్మెంట్లోని కియా సోరెన్టో, హ్యుందాయ్ శాంటాఫే మోడళ్లకు పోటీగా నిలువనుంది.

Most Read Articles

English summary
Skoda is planning to come out with a full size SUV, AutoCarUK has learn't, which interacted with company officials. If all goes according to plan, the said SUV will be launched in 2016, according to company Chairman, Winfried Vahland.
Story first published: Friday, December 20, 2013, 14:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X