అప్‌గ్రేడెడ్ యెతి ఎస్‌యూవీని పరిచయం చేయనున్న స్కొడా

By Ravi

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ, ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన ఆటో బ్రాండ్ 'స్కొడా' (Skoda) భారత మార్కెట్లో విక్రయిస్తున్న యెతి సెడాన్‌లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీలకు మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసినదే. అయితే, ఈ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇచ్చేలా స్కొడా నుంచి ఎలాంటి ఎస్‌యూవీ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో, ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్ స్కొడా యెతి ద్వారా దేశీయ ఎస్‌యూవీ విభాగంలోని ఇతర మోడళ్లతో పోటీ పడేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఈ స్కొడా యెతి ఫేస్‌లిఫ్ట్ త్వరలోనే యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది, ఆ తర్వాత భారత మార్కెట్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే అప్‌గ్రేడెడ్ 2014 స్కొడా యెటి ఎస్‌యూవీకి చెందిన ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు, మోడ్రన్ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేసిన కొత్త స్కొడా యెటిపై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Skoda Yeti Facelift

ఈ ఫొటోను బట్టి చూస్తే, 2014 స్కొడా యెటి కొత్త డిజైన్‌తో రిఫ్రెష్డ్ లుక్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ముందు వైపు కొత్త బంపర్, కొత్త గ్రిల్, కొత్త బ్యాడ్జ్‌లతో చాలా నీట్‌గా కనిపిస్తుంది. దీని వెనుక డిజైన్‌ను గమనిస్తే, C ఆకారంలో ఉండే టెయిల్ ల్యాంప్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. బాడీ కలర్డ్ బంపర్స్, సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ మరొక ప్రత్యేకత.

ఈ కొత్త స్కొడా యెతి ఎస్‌యూవీ ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 స్కొడా యెతి ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
Skoda is expected to launch Yeti facelift in European markets soon. Indian markets will see the new refreshed SUV, later in 2014. This is a recently leaked image of the Skoda Yeti on the web and it has been creating volumes since it gives a great idea of how the SUV will look like.
Story first published: Friday, August 16, 2013, 16:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X