1524 kmpl మైలేజీనిచ్చే కారును అభివృద్ధి చేసిన విద్యార్థులు

By Ravi

ఏంటి బాబు, మా చెవుల్లో ఏమైనా పూలు కనిపిస్తున్నాయా..? లీటరుకు 1524 కిలోమీటర్లనిచ్చే కారా..? మేం నమ్మాలా..? అని మనసులో అనుకుంటున్నారా..! కానీ ఇది నిజం. అమెరికాలోని యూనివర్సిటీ లావెల్, క్యూబెక్‌కు చెందిన విద్యార్థుల బృందం ఈ డ్రీమ్ మైలేజ్ కారును సృష్టించి ఔరా..! అనిపించుకున్నారు. అధిక మైలేజీనిచ్చే కార్ల అభివృద్ధి కోసం ప్రతి ఏటా ప్రముఖ చమురు సంస్థ షెల్ నిర్వహించే షెల్ ఈకో మారథాన్ పోటీ కోసం విద్యార్థులు తమ నైపుణ్యాలకు పనిపెట్టి ఇలాంటి కాన్సెప్ట్‌లను తయారు చేస్తుంటారు.

ఈ పోటీలా భాగంగా, ఒక్క లీటరు ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించే కార్లను విద్యార్థులు తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం విద్యార్థులు హైబ్రిడ్, సోలార్ వంటి వివిధ టెక్నాలజీలను వాడుకోవచ్చు. ఈ పోటీ కోసం లావెల్ యూనివర్సిటీ విద్యార్థులు తమ బృంద మేనేజర్ ఫిలిప్ బౌచర్డ్ ఆధ్వర్యంలో ఈ మ్యాజిక్ కారుకు రూపకల్పన చేశారు. అంతేకాదండోయ్.. ఈ కారు సదరు షెల్ ఈకో మారథాన్ పోటీలో పాల్గొన్న కార్లన్నింటినీ ఓవర్‌టేక్ చేసి విజేతగా నిలిచింది.

ఈ కారులో ఒక్క లీటరు పెట్రోల్‌తో 1524 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని విద్యార్థులు రుజవు చేసి చూపించారు. గడచిన సంవత్సరం నిర్వహించిన మారథాన్‌లో ఫిలిప్ బృందం విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో ఈ ఏడాది ఎలాగైనా ఈ మారథాన్‌ టైటిల్‌ను దక్కించుకోవాలని, గట్టి పట్టుదలతో ఈ కారును అభివృద్ధి చేశాని ఫిలిప్ తెలిపారు. ఇలాంటి కార్లు ప్రోటోటైప్ నుంచి ప్రొడక్షన్ టైప్‌కు వచ్చి మార్కెట్లో అందుబాటులోకి వస్తే ఎంత బాగుంటుందో కదా..! మీరేమంటారు..?

Students Build Car That Delivers 1524 KMPL Mileage
Most Read Articles

English summary
This year's winning team, headed by team manager Philippe Bouchard, had to forfeit last year due to complications developed with their engine. But the team has come back strong this year and has managed to win by developing a prototype vehicle that can, on a liter of petrol, travel 1524 km.
Story first published: Saturday, April 20, 2013, 7:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X