టాటా మోటార్స్ ఫుల్ థ్రోటల్ జంగిల్ ఎక్స్‌పీరియెన్స్ ప్రారంభం

By Ravi

టాటా మోటార్స్‌కు చెందిన మోటార్‌స్పోర్ట్ విభాగం టాటా మోటార్స్ ఫుల్ థ్రోటల్ (Tata Motors Full Throttle) మార్చి 23, 2013వ తేదీ నుంచి తమ 6వ ఎడిషన్ 'టాటా మోటార్స్ ఫుల్ థ్రోటల్ జంగిల్ ఎక్స్‌పీరియెన్స్'ను ప్రారంభించనుంది. ఆద్యంతం ఉత్సాహభరితంగా, ఉత్కంఠభరితంగా ఈ జంగిల్ ఎక్స్‌పీరియెన్స్ న్యూఢిల్లీ నుంచి ప్రారంభమై పన్నా, బాంధవ్‌ఘడ్, కన్చా, పెన్చ్ ప్రాంతాల మీదుగా ప్రయాణించి 1265 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుంది.

మార్చి 23 నుంచి ఐదు రోజుల పాటు సాగే ఈ టాటా మోటార్స్ ఫుల్ థ్రోటల్ జంగిల్ ఎక్స్‌పీరియెన్స్ మార్చి 27న మధ్యప్రదేశ్‌లోని పెన్చ్‌లో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 20కు పైగా టాటా మోటార్స్ యుటిలిటీ వాహనాలను పాల్గొంటాయి. మర్చిపోలేని మోటారింగ్ అనుభూతిని కల్పించేందుకు గాను ఈ రూట్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేశారు. డ్రైవింగ్ మధ్యలో హాల్టింగ్‌లు కూడా ఉంటాయి. ఈ సాహస యాత్రలో పాల్గొనే వారు భీకరమైన అడవులు, అందమైన సరస్సులు, సఫారీలను చూసే అవకాశం ఉంటుంది.

Tata Motors Full Throttle Jungle Experience

ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి టాటా మోటార్స్ అందిస్తున్న వివిధ ఎస్‌యూవీల యొక్క ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను పరిశీలించే అవకాశం కూడా కల్పించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గాను కౌగర్ మోటార్‌స్పోర్ట్‌ను టాటా మోటార్స్ తమ ప్రోగ్రామ్ పార్ట్‌నర్‌గా నియమించుకుంది. ఇందులో పాల్గొనే వారికి టాటా మోటార్స్ రవాణ, వైద్య తదితర సేవలను అందిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి ఎడిషన్ జంగింల్ ఎక్స్‌పీరియన్స్. ఇది ప్రత్యేకించి టాటా మోటార్స్ యుటిలిటీ వాహనాలను కలిగి ఉన్న యజమానుల కోసం మాత్రమే కంపెనీ నిర్వహిస్తోంది.

టాటా మోటార్స్ ఫుల్ థ్రోటల్ ఇప్పటికే హిమాలయన్ ఎక్స్‌పీరియెన్స్, కొంకన్ ఎక్స్‌పీరియెన్స్, థార్ ఎక్స్‌పీరియెన్స్, కచ్ ఎక్స్‌పీరియెన్స్, నీలగిరి ఎక్స్‌పీరియెన్స్ అనే ఆరు విభిన్న సీజన్‌లను నిర్వహించింది. ఇందులో పాల్గొనటానికి ఆసక్తి చూపేవారు టాటా మోటార్స్‌కు [email protected] మెయిల్ ఐడిపై ఈ-మెయిల్‌ను చేసిన మరిన్ని వివరాలు పొందవచ్చు. లేదా http://www.tatamotorsfullthrottle.com/ వెబ్‌సైట్‌ను సందర్శించి సమాచారం తెలుసుకోవచ్చు.

Most Read Articles

English summary
Tata Motors Full Throttle, the motorsport division of Tata Motors, will flag off its sixth expedition Tata Motors Full Throttle Jungle Experience, from the capital on 23rd March, 2013. The Jungle Experience will pass through– New Delhi, Panna, Bandhavgarh, Kanha, Pench, over a period of 5 days and cover a total distance of 1265 Km. The expedition will culminate in Pench in Madhya Pradesh, on March 27th, 2013.
Story first published: Wednesday, March 20, 2013, 14:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X