జనవరి నుంచి పెరగనున్న టాటా మోటార్స్ కార్ల ధరలు

By Ravi

కొత్త సంవత్సరంలో టాటా మోటార్స్ కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. వచ్చే నెల నుంచి ప్యాసింజర్ వాహనాల ధరలను 1 శాతం మేర పెంచేందుకు కంపెనీ యోచిస్తోంది. ప్యాసింజర్ వాహనాల ధరలను జనవరి 2014 నుంచి 1 శాతం పెంచుతామని, అయితే వాణిజ్య వాహనాల ధరలను పెంచే విషయంలో మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ అవసరమైనప్పుడు ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇదిలా ఉండగా, మరోవైపు దేశపు అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీలు కూడా జనవరి నుంచి ధరల పెంచేందుకు యోచిస్తున్నాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ కాస్ట్ మరియు ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ధరలను పెంచక తప్పదని ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఇదే బాటలో లగ్జరీ కార్ కంపెనీలు మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‍‌డబ్ల్యూ, ఆడి కంపెనీలు కూడా ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసినదే.

Tata Motors

బ్రెజిల్‌లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్
టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జెఎల్‌ఆర్‌) బ్రెజిల్‌ ఓ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్ కోసం 2020 నాటికి 240 మిలియన్‌ పౌండ్ల వరకు పెట్టుబడులను వెచ్చించనున్నామని కంపెనీ పేర్కొంది. ఈ మేరకు బ్రెజిలిన్‌ అధికారులతో రియో డిజానిరియోలో జెఎల్ఆర్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

సాలీనా 24,000 వాహనాలను ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌లో ప్రారంభంలో భాగంగా 400 మంది వరకు ఉద్యోగులను తీసుకుంటారని, ఇందులో సరికొత్త మోడళ్లను తయారు చేస్తామని, ప్రపంచస్థాయి కార్లను జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ను అత్యాధునిక పరిజ్ఞానంతో ఇక్కడ ఉత్పత్తి చేస్తుందని జెఎల్‌ఆర్‌ సీఈవో డాక్టర్‌ రాల్ఫ్‌ స్పెత్‌ తెలిపారు.

Most Read Articles

English summary
Auto major Tata Motors plans to hike prices of its passenger vehicles by about 1 per cent from next month. Tata Motors-owned Jaguar Land Rover (JLR) has said it would set up its first manufacturing unit in Brazil with an investment of up to 240 million pounds by 2020.
Story first published: Monday, December 9, 2013, 11:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X