తొలి త్రైమాసికంలో 24 శాతం తగ్గిన టాటా మోటార్స్ లాభం

By Ravi

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. క్యూ1 కంపెనీ ఏకీకృత నికరలాభంలో 23.81 శాతం క్షీణించి రూ.1,762.81 కోట్లకు పడిపోయింది. గడచిన సంవత్సరంలో ఇదే కాలంలో కంపెనీ నికరలాభం రూ.2,313.87 కోట్లుగా నమోదైందని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

అయితే, అమ్మకాల పరంగా చూస్తే, ఈ ఫలితాలు కొద్దిగా ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. ఈ ఏడాది క్యూ1లో కంపెనీ మొత్తం అమ్మకాలు రూ.46,751.26 కోట్లుగా ఉండగా క చేరగా.. గతేడాది క్యూ1లో కంపెనీ అమ్మకాలు రూ.43,171.13 కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక మందగమనంతో దేశీయ అమ్మకాలు క్షీణించడం, పోటీ కారణంగా వాహనాల ధరలు తగ్గించడం వంటి పలు అంశాలు కంపెనీ లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని టాటా మోటార్స్ సీఎఫ్‌వో సి. రామకృష్ణన్ వివరించారు.

Tata Motors

ఇదిలా ఉండగా, టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ అమ్మకాలు మాత్రం 13.31 శాతం వృద్ధి చెంది రూ.35,364.97 కోట్లకు చేరాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఈ అమ్మకాలు రూ.31,209.55 కోట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

క్యూ1లో 19 శాతం తగ్గిన దేశీయ అమ్మకాలు
మొత్తమ్మీద చూసుకుంటే, క్యూ1లో అమ్మకాల పరంగా వచ్చిన ఆదాయం అంతుకు ముందు కన్నా బాగానే ఉన్నప్పటికీ, అమ్మకాల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. ఈ త్రైమాసికంలో దేశీయ కార్ల అమ్మకాలు 19 శాతం తగ్గి 1,54,352 యూనిట్లకు పడిపోయాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 1,90,483 యూనిట్లుగా ఉన్నాయని టాటా మోటార్స్ తమ ప్రకటనలో వివరించింది.

Most Read Articles

English summary
India's largest vehicle maker Tata Motors Ltd on Wednesday reported a 23.81 per cent decline in consolidated net profit to Rs 1,762.81 crore for the first quarter ended June 30.
Story first published: Thursday, August 8, 2013, 10:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X