క్యూ4లో క్షీణించిన టాటా లాభాలు; అయినా అంచనాలు బ్రేక్

By Ravi

Tata JLR
టాటా మోటార్స్ లాభాలు భారీగా క్షీణించాయి. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చ్ నెలతో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ రూ. 3,945 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. జనవరి-మార్చి 2012 త్రైమాసికంలో ఆర్జించిన నికర లాభంతో రూ. 6,234 కోట్లతో పోల్చుకుంటే ఇది దాదాపు 37 శాతం క్షీణతను నమోదు చేసింది. అయితే, ఇదే కాలానికి కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం రూ. 50,908 కోట్ల నుంచి రూ. 56,002 కోట్లకు పెరిగి 10 శాతం వృద్ధిని కనబరిచింది.

టాటా మోటార్స్‌ నాలుగో త్రైమాసి కంలో నికరలాభంలో 37 శాతం నష్టాన్ని చవిచూసినప్పటికీ, మార్కెట్‌ అంచనాలను అధిగమించింది. జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ పీఎల్‌సీ యూనిట్‌ రికార్డు స్థాయి విక్రయాలతో భారత్‌లో వాటిల్లిన నష్టాలను కంపెనీ అధిగమించగలిగింది. ఓ రకంగా చెప్పాలంటే, టాటా మోటార్స్‌ను జెఎల్ఆర్ ఎంతగానో ఆదుకుంది. గడచిన ఆర్థిక సంవత్సరం (2012-13) పూర్తికాలానికి గాను కంపెనీ నికర లాభం రూ. 13,516 కోట్ల నుంచి రూ. 9,893 కోట్లకు పడిపోయింది.

అయితే, ఇదే సమయంలో అమ్మకాలు రూ. 1,65,654 కోట్ల నుంచి రూ. 1,88,818 కోట్లకు పెరిగాయి. మాతృసంస్థ లాభంలో 90 శాతం, విక్రయాల్లో 70 శాతానికి పైగా మొత్తాలు జేఎల్‌ఆర్‌ నుంచి వచ్చినవే. బ్లూమ్‌బర్గ్‌ పోల్‌లో విశ్లేషకులు కంపెనీ నికర లాభం రూ. 2,733.60 కోట్లుగా ఉండగలదని, విక్రయాలు రూ. 51,569.10 కోట్లుగా ఉండగలవని అంచనా వేశారు. ఈ అంచనాలను కంపెనీ అధిగమించడం విశేషం. జేఎల్‌ఆర్‌ ఈ త్రైమాసికంలో 116,340 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 18.7 శాతం అధికం.

టాటా మోటార్స్ దేశీయ అమ్మకాల విషయానికి వస్తే, ఈ నాల్గవ త్రైమాసింలో 32 శాతానికి పైగా క్షీణించి రూ. 11,068 కోట్లకు పరిమితంకాగా, వాహన విక్రయాలు 31 శాతం క్షీణించి 1,97,056 యూనిట్లకు చేరాయి. నికర నష్టం రూ. 312 కోట్లుగా నమోదైంది.

Most Read Articles

English summary
Auto major Tata Motors on Wednesday reported 36.71 per cent decline in its consolidated net profit at Rs 3,945.47 crore for the fourth quarter ended March 31. The company had posted a consolidated net profit of Rs 6,234 crore in same quarter of the previous fiscal, Tata Motors said in a statement.
Story first published: Thursday, May 30, 2013, 9:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X