రివర్స్ గేర్‌లో టాటా నానో అమ్మకాలు, ఏప్రిల్‌లో భారీ క్షీణత

By Ravi

Tata Nano Sales
మధ్యతరగతి ప్రజల కారు కలను నిజం చేయాలనుకున్న రతన్ టాటా కలను మాత్రం మధ్యతరగతి ప్రజలు నిజం చేయటం లేదు. 2008 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో తొలిసారిగా టాటా నానో కారును ఆవిష్కరించినప్పుడు, ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారుగా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించి విమర్శకుల చేత సైతం ఔరా అనిపించుకుంది. లక్ష రూపాయలకే కారు అంటూ ప్రజలను ఊదరగొట్టిన టాటా మోటార్స్ ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఈ కారును లక్షల రూపాయలకు అందించలేకపోయింది.

దీనికి తోడు సేఫ్టీ పరంగా టాటా నానో అంత సమర్థవంతంగా లేదని విమర్శలు రావటం, పలు నానో కార్లు అగ్నికి ఆహుతి కావటంతో ప్రజలు ఈ కారును కొనాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. వీటికి అదనంగా పెట్రోల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటం కూడా మైలేజ్ గురించి ఆలోచించే కొనుగోలుదారులను ఆలోచింప జేస్తుంది. టాటా నానో అమ్మకాలను పెంచుకునేందుకు అనేక మార్కెటింగ్ ప్రణాళికలు చేపట్టినప్పటికీ అందులో ఏ ఒక్కటి కూడా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో టాటా నానో కొనుగోలు చేస్తారా అని కస్టమర్లను అడిగితే వారు నోనో అని సమాధానమిస్తున్నారు. ఇందుకు ప్రత్యక సాక్ష్యం గడచిన నెల అమ్మకాలే. ఏప్రిల్ 2013లో టాటా మోటార్స్ కేవలం 943 టాటా నానో కార్లను మాత్రమే విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెల అమ్మకాలతో పోల్చుకుంటే ఇది 88 శాతం తక్కువ. ఏప్రిల్ 2012లో టాటా మోటార్స్ మొత్తం 8028 టాటా నానో కార్లను విక్రయించింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో నానో ఆటోమొబైల్ చరిత్రలో ఓ పేజీగా మిగిలిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Most Read Articles

English summary
Tata Motors has sells just 948 units of Nano in April 2013, Nano sales declined over 88 percent during the month compared to 8,028 units sold in April last year.
Story first published: Wednesday, May 8, 2013, 13:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X