పవర్ స్టీరింగ్ 'టాటా నానో ట్విస్ట్'పై మరిన్ని డిటేల్స్

By Ravi

టాటా నానోలో పవర్ స్టీరింగ్ వెర్షన్‌ (నానో ట్విస్ట్)ను కంపెనీ వచ్చే జనవరిలో(15వ తేదీన) విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ కొత్త 2014 టాటా నానో ట్విస్ట్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం రండి..!

  • ప్రస్తుతం లభిస్తున్న రెగ్యులర్ టాటా నానో కారుతో పాటుగా ఈ కొత్త 2014 టాటా నానో ట్విస్ట్ (పవర్ స్టీరింగ్ వెర్షన్)ను కూడా ఆఫర్ చేస్తారు.
  • పవర్ స్టీరింగ్ కలిగిన టాటా నానో ట్విస్ట్ రెగ్యులర్ టాటా నానో ధర కన్నా సుమారు రూ.15,000 అధికంగా ఉండొచ్చని అంచనా.
  • నానో ట్విస్ట్‌లో ఉపయోగించనున్న పవర్ స్టీరింగ్‌ను జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ కంపెనీ జెడ్ఎఫ్ ఫ్రీడ్రిచ్‌సాఫెన్ నుంచి సేకరిస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్.
  • టాటా నానో ట్విస్ట్‌ను ఎక్స్ఈ, ఎక్స్‌టి అనే రెండు వేరియంట్లలో ఆఫర్ చేయనున్నారు. ఈ రెండు వేరియంట్లు ప్రస్తుత సిఎక్స్, ఎల్ఎక్స్ మాదిరిగానే ఉంటాయి. వీటిల్లో కేవలం పవర్ స్టీరింగ్ ఫీచర్ మాత్రమే భిన్నంగా ఉంటుంది.
  • నానో ట్విస్ట్ కొత్త పర్పల్ బాడీ కలర్‌లో లభ్యం కానుంది.

Tata Nano
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త టాటా నానో ట్విస్ట్ జననరి 15, 2014న విడుదల కానుంది. కాగా.. కొత్త టాటా నానో ట్విస్ట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం నానోలో ఉపయోగిస్తున్న 624సీసీ పెట్రోల్ ఇంజన్‌నే కొత్త నానో ట్విస్ట్‌లోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.
Most Read Articles

English summary
After first telling us about the existence of the Nano Twist, AutoCar has now revealed further information about the power steering equipped Nano. Here is a quick rundown on things we know about the car so far.
Story first published: Monday, December 16, 2013, 16:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X