టాటా సఫారీ స్టోర్మ్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్; రూ.10.86 లక్షలు

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీలో మరొక కొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. ప్రత్యేకించి ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం రూపొందించిన టాటా సఫారీ స్టోర్మ్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌ (Tata Safari Storme Explorer Edition)ను కంపెనీ భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దేశీయ విపణిలో ఈ కొత్త సఫారీ వేరియంట్ ధర రూ.10.86 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా ఉంది.

రెగ్యులర్ సఫారీ స్టోర్మ్‌తో పోల్చుకుంటే, కొత్త సఫారీ స్టోర్మ్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌‌లో అనేక అధనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇందులో ప్రధానంగా, ఫ్రంట్ బంపర్ ప్రొటెక్షన్ గార్డ్, స్పోర్టీ బాడీ డెకాల్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్‌కు క్రోమ్ గార్నిష్, ఎక్స్‌‌ప్లోరర్ ఎడిషన్ డోర్ విజర్స్, 2-డిన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్, ఫాక్స్ లెథర్ సీట్ కవర్, నావిగేషన్ డివైజ్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

Tata Safari Storme Explorer Edition

వినియోగదారుల ఎంపిక మేరకు ఆప్షనల్ ఫీచర్లుగా సైకిల్ క్యారియర్, కార్గో బాస్కెట్, రూఫ్ మౌంటెడ్ కానోపీ పీచర్లు కూడా లభ్యమవుతాయి. కొత్త టాటా సఫారీ స్టోర్మ్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. టాటా సఫారీ స్టోర్మ్‌లో 2.2 లీటర్ వ్యారీకార్, వివిటి (వేరియబల్ టర్బైన్ టెక్నాలజీ)తో కూడిన టర్బోచార్జ్‌డ్ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 15 సెకండ్ల వ్యవదిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
Most Read Articles

English summary
Tata Motors has just launched a new avatar of Tata Safari Storme called Explorer Edition. Tata Safari Storme Explorer Edition gets navigation, 2-DIN music system, reverse camera and few other features. This rugged SUV is priced at INR 10.86 lakh.
Story first published: Friday, August 23, 2013, 15:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X