భారత్‌లో టొయోటా ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభం

By Ravi

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ భారత్ తమ పాపులర్ 'టొయోటా ఎక్స్‌ప్రెస్ సర్వీస్' (టిఈఎస్) సౌకర్యాన్ని మొదటిసారిగా ప్రారంభించింది. జపనీస్ కార్ కంపెనీ తమ ఎక్స్‌ప్రెస్ మెయింటినెన్స్ 60 మాడ్యూల్ (ఈఎమ్60)లో భాగంగా ఈ టిఈఎస్ సౌకర్యాన్ని అందిస్తోంది.

భారత్‌లో తొలి టొయోటా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ (టిఈఎస్)ను న్యూఢిల్లీలోని రామా రోడ్ వద్ద ఉన్న గెలాక్సీ టొయోటా డీలర్‌షిప్ వద్ద ప్రారంభించారు. మొత్తం 8,000 చదరపు అడుగులు కలిగిన ఈ సర్వీసింగ్ సెంటర్ రోజుకు 35 కార్లను సర్వీస్ చేసే సామర్థ్యం ఉంది. టొయోటా డీలర్‌షిప్‌కు సమీపంలో ప్రారంభించిన ఈ టిఈఎస్ వద్ద స్పేర్ పార్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.

Toyota Express Service

టిఈఎస్ సౌకర్యంలో భాగంగా, టొయోటా కార్లను వీలైనంత తక్కువ సమయంలో సర్వీస్ చేసి ఇస్తారు. అధునాతన, మోడ్రన్ పరికరాలను ఉపయోగించి, జాప్యం జరగకుండా వేగంగా మరియు వినియోగదారులు సంతృప్తి చెందేలా సర్వీస్ చేసి ఇవ్వటం టిఈఎస్ స్పెషాలిటీ.

టొయోటా ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లో భాగంగా, కార్లను నీటితో కాకుండా, డ్రై వాష్ చేస్తారు. ఈ విధానంలో కార్లను నీటితో శుభ్రం చేసిన దాని కన్నా చక్కగా శుభ్రం చేయటం కుదురుతుందని చెబుతున్నారు. రెండవ టిఈఎస్‌ను బెంగుళురూలో ప్రారభిస్తామని, త్వరలోనే ఈ సేవలను దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని కంపెనీ పేర్కొది.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motor has introduced the Toyota Express Service (TES) facility in India for the first time. TES is a facility provided by the Japanese automaker under its Express Maintenance 60 module (EM60) that involves surviving a car in 60 minutes or less.
Story first published: Wednesday, December 18, 2013, 17:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X