భారత్‌లో 1000 టొయోటా కరోలా ఆల్టిస్ డీజిల్ కార్ల రీకాల్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ టొయోటా దేశీయ విపణిలో అందిస్తున్న కరోలా ఆల్టిస్ డీజిల్ కార్లలో సమస్యలు తలెత్తుతున్నాయనే నెపంతో దాదాపు 1,000 కార్లను కంపెనీ వెనక్కు పిలిపించింది. డ్రైవ్‌షఫ్ట్‌కు సంబంధించిన సమస్య కారణంగా వీటిని రీకాల్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఆగస్ట్ 3, 2012 నుంచి ఫిబ్రవరి 14, 2013 మధ్య కాలంలో ఉత్పత్తి అయిన కార్లలో ఈ సమస్యను గుర్తించినట్లు టొయోటా తెలిపింది.

ఈ డ్రైవ్‌షఫ్ట్ సమస్య కారణంగా కారు కుడి లేదా ఎడమై వైపుకు దారితప్పుతున్నట్లు టొయోటా కొన్ని కేసుల్లో గుర్తించింది. రీకాల్ చేసిన కరోలా ఆల్టిస్ కార్లలో ఈ సమస్యను పరిశీలించిన తర్వాత దానిని రిపేర్ లేదా రీప్లేస్ చేయటం జరుగుతుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయటానికి సుమారు రెండు గంటల సమయం పడుతుందని, దీనిని ఉచితంగా చేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ రీకాల్‌కు సంబంధించి కంపెనీ తమ వినియోగదారులకు ప్రత్యేకంగా తెలియజేయనుంది.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా టొయోటా దాదాపు 1,000 కరోలా సెడాన్లను రీకాల్ చేసింది. జనవరి-జూన్ 2003 మధ్య కాలంలో తయారైన ఈ కార్లలో ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ సమస్య కారణంగా వీటిని రీకాల్ చేయటం జరిగింది. అలాగే, అక్టోబర్ 2012లో దాదాపు 8,700 క్యామ్రీ, కరోలా ఆల్టిస్ కార్లను కంపెనీ రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, మరొక జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా తమ మైక్రా, సన్నీ కార్లలో మాస్టర్ బ్రేక్ సిలిండర్ల సమస్య కారణంగా మొత్తం 22,188 మైక్రా, సన్నీ కార్లను రీకాల్ చేసింది.

Toyota Recall
Most Read Articles

English summary
Japanese carmaker Toyota Cars India has announced a third recall of cars in India over the last one year, calling back nearly 1,000 units of the Altis sedan to fix a potential problem with the driveshaft. The recall will cover the diesel variant manufactured between August 3, 2012, and February 14, 2013.
Story first published: Monday, May 27, 2013, 11:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X