ఎయిర్ బ్యాగ్, వైపర్ల ససమ్య; టొయోటా కార్లు వెనక్కి

By Ravi

Toyota Recall
జపనీస్ కార్ కంపెనీ టొయోటా రీకాల్ పరంపర కొనసాగుతూనే ఉంది. టొయోటా మోటార్ కార్పోరేషన్‌ తాజాగా ఎయిర్‌ బ్యాగ్‌ల సమస్య కారణంగా 9,07,000 వాహనాలను (అధిక భాగం కరోలా కార్లు), వైపర్ల సమస్య కారణంగా మరో 3,85,000 లెక్సస్ ఐఎస్ లగ్జరీ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విక్రయించిన కరోలా కార్లలో ఈ సమస్య ఉన్నట్లు సమాచారం.

అయితే, ఈ సమస్యల వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించలేదని, కానీ ఎయిర్‌ బ్యాగ్‌ల సమస్య కారణంగా జపాన్, నార్త్ అమెరికాల నుంచి 46 ఫిర్యాదులు వచ్చాయని, అలాగే విండ్‌షీల్డ్ వైపర్ల సమస్యకు సంబంధించి 25 ఫిర్యాదులు వచ్చాయని టొయోటా మోటార్ కార్పోరేషన్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

డిసెంబర్ 2001 నుంచి మే 2004 మధ్య కాలంలో కార్లలో ఎయిర్‌ బ్యాగ్‌ల సమస్యను గుర్తించినట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో 7,52,000 కరోలా, కరోలా మ్యాట్రిక్ కార్లను అమెరికాలో విక్రయించగా, వేలాది సంఖ్యలో కార్లను జపాన్, మెక్సికో, కెనడా దేశాల్లో విక్రయించారు. ఇకపోతే, అధికంగా మంచు కురిసేటప్పుడు వైపర్లు కదలకుండా ఆగిపోతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని కంపెనీ తెలిపింది.

ఈ రీకాల్‌కు వర్తించే కార్లకు సంబంధించి తమ వినియోగదారులకు ప్రత్యేకంగా తెలియజేస్తామని, ఏవైనా లోపాలుంటే ఉచితంగా సవరిస్తామని టొయోటా పేర్కొంది. కాగా.. ఈ రీకాల్ ఇండియాలో విక్రయించిన కరోలా కార్లకు వర్తిస్తుందో లేదో టొయోటా వివరించలేదు.

Most Read Articles

English summary
Toyota is recalling 907,000 vehicles, mostly Corolla models, around the world for faulty air bags and another 385,000 Lexus IS luxury cars for defective wipers, Toyota Motor Corp spokesman Naoto Fuse said today.
Story first published: Thursday, January 31, 2013, 14:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X