ట్రక్ రేసింగ్‌ను భారత్‌కు పరిచయం చేయనున్న టాటా

By Ravi

బైక్ రేస్ గురించి విన్నాం, కార్ రేస్ గురించి విన్నాం కానీ ఈ ట్రక్ రేసింగ్ ఏంటి స్వామీ అనుకుంటున్నారా..? భారత్‌కు ట్రక్ రేసింగ్ కొత్తేమో కానీ ప్రపంచ దేశాల్లో మాత్రం ఇది షరామామూలే. కార్ రేస్‌లను నిర్వహించనట్లుగానే అక్కడ బైక్‌ రేస్‌లను నిర్వహిస్తుంటారు.

వచ్చే ఏడాది ఫార్ములా వన్ రేస్ భారత్‌కు రాకపోవచ్చేమో కానీ ఈ ట్రక్ రేసింగ్ మాత్రం వచ్చి తీరుతుంది. ఈ ట్రక్ రేస్‌ను భారత్‌కు పరిచయం చేయనుంది మరెవరో కాదు, మన దేశీయ వాణిజ్య వాహన దిగ్గజం టాటా మోటార్స్.

అంతా సజావుగా జరిగితే మార్చ్ 2014 నుంచి భారత్‌లో ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమవుతుంది. ఫెడరేషన్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎమ్ఎస్‌సిఐ) అధ్యక్షుడు వికీ ఛాంధోక్ ఇండియాటుడేతో ఈ విషయాన్ని వెల్లడించారు.

Tata Prima Truck

ఇలాంటి భారీ వాహనాలను సైతం హ్యాండిల్ చేయగలిన రేస్ ట్రాక్ బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (ఇదే ట్రాక్‌పై ఫార్ములా వన్‌తో వివిధ మోటార్‌స్పోర్ట్ కార్యక్రమాలు జరుగుతుంటాయి)పై టాటా మోటార్స్ ద్వారా నిర్వహించబడే ట్రక్ రేసింగ్ జరగవచ్చని ఆయన అన్నారు.

ఈ విషయంపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండగా, దీని కోసం దాదాపు ఏడాదిన్నరగా పనులు జరుగుతున్నట్లు సమాచారం. టాటా ఇప్పటికే 12 ప్రైమా బ్రాండ్ హెవీ ట్రక్కులను మోడిఫై చేసి, జంషడ్‌పూర్ ప్రాంతంలో టెస్టింగ్ చేస్తోంది.

ట్రక్ రేసింగ్ ప్రారంభ సంవత్సరంలో భాగంగా, టాటా మోటార్స్ సింగిల్ రౌండ్‌ను మాత్రమే నిర్వహించాలని యోచిస్తోంది. ఆ తర్వాత దీనికి లభించే స్పందనను బట్టి మల్టీ-బిల్డ్ సిరీస్‌గా మార్చే అవకాశం ఉంటుంది. ఈ రేస్‌లో 12 ట్రక్కులను ఉపయోగిస్తారు.


దేశ విదేశాలకు చెందిన డ్రైవర్లు ఈ ట్రక్ రేసింగ్‌లో పాల్గొంటారు. ఈ ట్రక్కులు సాధారణ ట్రక్కుల మాదిరి కాకుండా, రేస్‌కు అనుగుణంగా ఫుల్ రోల్ కేజ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, రేస్ స్పెసిఫిక్ ఫ్యూయెల్ ట్యాంక్, బ్రేక్ కూలర్స్, బకెట్ సీట్స్ మొదలైన మోడిఫికేన్లతో ఉంటాయి.

రేసింగ్ ట్రక్కులు ఎల్లప్పుడూ ఆరు చక్రాలను కలిగి ఉండి, వెనుక వైపు లోడ్ క్యారీయింగ్ ట్రైలర్లను తొలగించబడి ఉంటాయి. యూరప్ దేశాల్లో ఇప్పటికే ట్రక్ రేసింగ్ ఓ మేజర్ అట్రాక్షన్‌గా ఉంటుంది. మరి మన దేశంలో ఈ ట్రక్ రేసింగ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే, మరికొన్ని నెలలో ఒపిక పట్టాల్సిందే..!

Most Read Articles

English summary
Formula 1 may not return to India next year. However, motorsports fans in India will be excited when they'll learn Tata Motors is looking to bring truck racing to India. And if all goes well, we could have our very first truck racing championship as early as March 2014. 
Story first published: Tuesday, December 10, 2013, 11:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X