వచ్చే ఏడాదిలో ఫోక్స్‌వ్యాగన్ బడ్జెట్ కార్ బ్రాండ్ ఆవిష్కరణ

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ భారత్ వంటి మార్కెట్ల కోసం తమ బడ్జెట్ కార్ బ్రాండ్ 'డాట్సన్'ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కూడా ఓ బడ్జెట్ కార్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.

ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న 2013 టోక్యో మోటార్ షోలో కంపెనీ డెవలప్‌మెంట్ హెడ్ హీన్జ్-జాకబ్ న్యూసెర్ ఈ ప్రణాళిక గురించి వెల్లడించారు. మరో 12 నెలల సమయంలో తమ కంపెనీ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బడ్జెట్ కార్ బ్రాండ్‌ను ఆవిష్కరిస్తామని ఆయన చెప్పారు.

Volkswagen Budget Car Brand

వాస్తవానికి ఇలాంటి చవక కార్ల యొక్క నాణ్యత విషయంలో ఇప్పటికే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా.. ఫోక్స్‌వ్యాగన్ బడ్జెట్ కార్ బ్రాండ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. అయితే, తమ బడ్జెట్ కార్లు తక్కువ ధర కలిగి ఉన్నప్పటికీ, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడేదిలేదని కంపెనీ స్పష్టం చేస్తోంది. తమ బ్రాండ్ ఇమేజ్‌కు తగినట్లుగా వీటి నాణ్యత ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ బడ్జెట్ కారు విషయంలో తాము ఖర్చు పరంగా ఇంకా పనిచేస్తూనే ఉన్నామని, ఇది సేఫ్టీ, రైడ్, హ్యాండ్లి, కంఫర్ట్ మొదలైన అంశాల్లో తమ ప్రమాణాలకు అనువుగా ఉండి, లబ్ధిదాయకంగా ఉంటేనే దీనిని పూర్తిస్థాయిలో తయారు చేస్తామని న్యూసెర్ చెప్పారు. తమ నుంచి ప్రజలు ఆశించే అన్ని నాణ్యత ప్రమాణాలను ఈ బడ్జెట్ కార్లు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని అన్నారు.

Most Read Articles

English summary
Nissan isn't the only car manufacturer looking to build a budget sub-brand. Europe's largest automaker, Volkswagen is not averse to the idea either and is in fact already studying the viability of such a project. At the Tokyo Motor Show Volkswagen's head of development, Heinz-Jakob Neusser revealed that a separate budget brand under the company could surface in about 12 months.
Story first published: Monday, November 25, 2013, 14:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X