10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అభివృద్ధి చేస్తున్న ఫోక్స్‌వ్యాగన్

By Ravi

Volkswagen Working On 10 Speed Automatic Gearbox
మీ కారుకు ఎన్ని గేర్లు ఉన్నాయ్. సాధారణంగా అయితే, మహా అయితే ఆరు గేర్లు ఉంటాయ్. అదే ఆటోమేటిక్ గేర్లు కలిగిన కార్ల విషయానికి వస్తే, సాధారణంగా నాలుగు గేర్ల నుంచి 7-8 గేర్ల వరకూ ఉంటాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ల్యాండ్ రోవర్ ఇటీవలే తమ కారులో 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించింది.

దీంతో ల్యాండ్ రోవర్ ప్రపంచంలో కెల్లా 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన మొట్టమొదటి కారుగా రికార్డు సృష్టించింది.కాగా, తాజాగా జర్మనీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఏకంగా 10 గేర్లు ఉండే ట్రాన్సిమిషన్ (గేర్‌‌బాక్స్)ను అభివృద్ధి చేసే పనిలో ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఓ 10-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను అభివృద్ధి చేస్తుంది. వియన్నా మోటార్ సినాప్సియంలో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఛీఫ్ మార్టిన్ వింటర్‌కోర్న్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదే కాకుండా, తమ గ్రూప్ ప్రతి 1000సీసీ సామర్థ్యాన్ని 134 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ఓ హై-పెర్ఫామెన్స్ ఇంజన్‌ను కూడా అభివృద్ధి చేస్తుందని ఆయన అన్నారు. సాధారణంగా అధిక ఆటోమేటిక్ గేర్లు కలిగిన కార్లు ఎక్కువ మైలేజీనిస్తాయని ఆటోమొబైల్ కంపెనీలు పేర్కొంటున్నాయి.

Most Read Articles

English summary
If Land Rover's 9 speed transmission left you intrigued then you'll be amused to know that Volkswagen has confirmed it is working on a 10 speed dual clutch automatic transmission. In addition, the VW Group is also developing a diesel engine that is capable of generating 134 HP from every 1000cc.
Story first published: Tuesday, April 30, 2013, 11:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X