300 కి.మీ. వేగంతో ఫెరారీ కారును క్రాష్ చేస్తే ఏమవుతుంది?

By Ravi

గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైతే ఏమవుతుంది..? నుజ్జు నుజ్జు అయిపోతుంది కదూ..! అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేది క్రాష్ టెస్ట్ గురించి కాదు, నిజమైన యాక్సిడెంట్ గురించి. జర్మనీలో ఈనెల 1వ తేదిన మితిమీరిన వేగంతో వెళ్తున్న 'ఫెరారీ ఎఫ్430' స్పోర్ట్స్ కారు ప్రమాదానికిగురైంది.

ఈ ఫెరారీ కారును మార్కస్ ఆర్ (41 ఏళ్లు) ఆయన భార్య ఏంజిలా (39 ఏళ్లు) జర్మనీలోని ఏ7 ఆటోబాన్ హైవేపై గరిష్టంగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో క్రూయిజ్ చేస్తుండగా, హఠాత్తుగా వెనుక టైరు బద్దలై కారు అదుపుతప్పి ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ఈ కారు సినీ ఫక్కీలో ఫార్ములా వన్ కార్ క్రాష్‌లలో మాదిరిగా గాలిలో ఫల్టీలు కొట్టుకుంటుపోయిన పక్కనే ఉన్న గార్డ్‌రెయిల్స్‌ను గుద్దుకుంటు కొంతదూరంలో ఆగిపోయింది.

ఈ క్రింద చిత్రాలను గమనించినట్లయితే, శకలాలుగా మిగిలిన ఈ ఫెరారీ కారును రిపేరు చేసేందుకు ఒక్క శాతం అవకాశం కూడా లేనట్లు కనిపిస్తోంది. ఆశ్చకరమైన విషయం ఏంటంటే, ఇంత భారీ ప్రమాదం సంభవించినప్పటికీ ఈ కారులో ప్రయాణిస్తున్న మార్కస్, ఏంజిలాలు మాత్రం చిన్న గాయం కూడా కాకుండా భయటపడ్డారు. ఈ సంఘటన మనకు మరోసారి వేగం కన్నా ప్రాణం మిన్న అనే అంశాన్ని గుర్తు చేస్తుంది. మన వద్ద ఎంత వేగంతో వెళ్లే కార్లయినా ఉండొచ్చు, వాటి పరిమిత వేగంతో నడిపితేనే వినోదం లేకపోతే విషాదమే.

ఫెరారీ క్రాష్

ఫెరారీ క్రాష్

జర్మనీలో ప్రమాదానికి గురైన ఫెరారీ ఎఫ్430 కారు.

ఫెరారీ క్రాష్

ఫెరారీ క్రాష్

జర్మనీలో ప్రమాదానికి గురైన ఫెరారీ ఎఫ్430 కారు.

ఫెరారీ క్రాష్

ఫెరారీ క్రాష్

ఫెరారీ ఎఫ్430 కారు

ఫెరారీ క్రాష్

ఫెరారీ క్రాష్

ఫెరారీ ఎఫ్430 కారు

ఫెరారీ క్రాష్

ఫెరారీ క్రాష్

ఫెరారీ ఎఫ్430 కారు

Most Read Articles

English summary
We are not talking about a crash test here, but about a Ferrari involved in an actual accident when travelling at 300 km/h. The answer is, it gets wrecked. Totally destroyed. This incident occurred on May 1st on a German highway. 41 year-old Markus R and his 39 year old wife Angela were cruising in their Ferrari F430 supercar on Germany's A7 autobahn at 300 km/h or 186 mph, when suddenly the right rear tyre burst.
Story first published: Friday, May 10, 2013, 14:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X