మారుతి సుజుకి వ్యాగన్ఆర్ డీజిల్ వస్తోంది..!

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తక్కువ ధర కలిగిన డీజిల్ కార్లను విడుదల చేయనుందని, ఇందుకోసం ఓ చిన్న డీజిల్ ఇంజన్‌‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోందని మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. వాస్తవానికి మారుతి సుజుకి డీజిల్ కార్ల కన్నా పెట్రోల్ కార్ల పోర్ట్‌‌ఫోలియోనే అధికంగా ఉంది. దీంతో డీజిల్ కార్ల అభివృద్ధిపై దృష్టి సారించిన మారుతి సుజుకి, గుజరాత్‌లో ఓ డీజిల్ ఇంజన్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తుంది.

ఈ మేరకు మారుతి సుజుకి ఓ చిన్న డీజిల్ కారును భారత మార్కెట్ కోసం ప్రవేశపెట్టనుంది. అయితే, ఈ సరికొత్త చిన్న డీజిల్ కారుతో పాటుగా ప్రస్తుతం మారుతి సుజుకి అందిస్తున్న పెట్రోల్ వెర్షన్ వ్యాగన్ఆర్‌లో కూడా డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్టో తర్వాత మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న పెట్రోల్ కారు వ్యాగన్ఆర్ అనే విషయం మనకు తెలిసినదే.

ఈ నేపథ్యంలో, వ్యాగన్ఆర్ పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు కంపెనీ ఇందులో డీజిల్ వేరియంట్‌ను విడుదల చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేవలం వ్యాగన్ఆర్‌లోనే కాకుండా మారుతి ఏ-స్టార్, ఆల్టో (1000సీసీ వేరియంట్)లో కూడా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకురావచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, మారుతి అభివృద్ధి చేస్తున్నది 1.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ అని తెలుస్తోంది. తాజా అప్‌‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Maruti Wagon R
Most Read Articles

English summary
Maruti Suzuki is planning to launch diesel version of it's popular hatchback Wagon R. As per the sources, Maruti Suzuki is working on a small diesel engine, may be company will use this engine in new Wagon R.
Story first published: Thursday, July 4, 2013, 16:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X