2014 ఫియట్ లీనియా విడుదల; ధర రూ.6.99 లక్షలు

By Ravi

గడచిన నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఫియట్ ఇండియా ఆవిష్కరించిన సరికొత్త అప్‌డేటెడ్ ఫియట్ లీనియా సెడాన్‌ను కంపెనీ నేడు (మాచ్ 4, 2014) దేశీయ విపణిలో విడుదల చేసింది. కొత్త 2014 ఫియట్ లీనియా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో యాక్టివ్, డైనమిక్ మరియు ఎమోషన్ అనే మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

* ఫియట్ లీనియా యాక్టివ్ (పెట్రోల్) - రూ.6.99 లక్షలు
* ఫియట్ లీనియా టి-జెట్ యాక్టివ్ (పెట్రోల్) - రూ.7.44 లక్షలు
* ఫియట్ లీనియా టి-జెట్ డైనమిక్ (పెట్రోల్) - రూ.8.53 లక్షలు
* ఫియట్ లీనియా టి-జెట్ ఎమోషన్ (పెట్రోల్) - రూ.9.01 లక్షలు
* ఫియట్ లీనియా మల్టీ-జెట్ యాక్టివ్ (డీజిల్) - రూ.8.15 లక్షలు
* ఫియట్ లీనియా మల్టీ-జెట్ డైనమిక్ (డీజిల్) - రూ.9.27 లక్షలు
* ఫియట్ లీనియా మల్టీ-జెట్ ఎమోషన్ (డీజిల్) - రూ.9.72 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ కొత్త 2014 ఫియట్ లీనియా సెడాన్‌ను ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్లలో కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా రిఫ్రెష్డ్ ఎక్విప్‌మెంట్‌తో అప్‌గ్రేడ్ చేశారు. ఆ వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

2014 ఫియట్ లీనియా విడుదల

ఎక్స్టీరియర్ మార్పులను గమనిస్తే.. ముందువైపు సరికొత్త బంపర్, పెద్ద ఎయిర్ డ్యామ్, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, మరింత క్రోమ్ ఫినిషింగ్, కొత్త గ్రిల్‌తో ఇది సరికొత్త లుక్‌ని కలిగి ఉంటుంది.

2014 ఫియట్ లీనియా విడుదల

సైడ్ ప్రొఫైల్‌లో టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్ మినహా పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ లేవు.

2014 ఫియట్ లీనియా విడుదల

అప్‌గ్రేడెడ్ 2014 ఫియట్ లీనియా సెడాన్‌లో సరికొత్త అల్లాయ్ వీల్స్‌ను అందిస్తున్నారు.

2014 ఫియట్ లీనియా విడుదల

వెనుక వైపు డిజైన్‌ను గమనిస్తే.. లైసెన్స్ ప్లేట్ మరియు దానిపై భాగంలో క్రోమ్ స్ట్రిప్‌తో కూడిన రివైజ్డ్ బూట్ లిడ్, కొత్త బంపర్ మరియు దానిపై మందపాటి క్రోమ్ స్ట్రిప్‌ను ఇందులో చూడొచ్చు. అలాగే వెనుక బంపర్‌పై ఇరువైపులా చివర్లలో ఉండే ఇంటిగ్రేటెడ్ రిఫ్లెక్టర్స్ మరియు మధ్యలో ఫాక్స్ ఎయిర్ డిఫ్యూజర్‌ను కూడా గమనించవచ్చు.

2014 ఫియట్ లీనియా విడుదల

కొత్త ఫియట్ లీనియా ఇంటీరియర్లలో కూడా ప్రధానమైన మార్పులను గమనించవచ్చు. ముందుగా.. డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ఆక్స్ఇన్ సపోర్ట్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త డబుల్ డిన్ ఆడియో సిస్టమ్‌ను ఇందులో ఆఫర్ చేస్తున్నారు. హెచ్‌విఏసి (హీటర్/ ఎయిర్ కండిషనింగ్) కంట్రోల్స్ మాత్రం ఇదివరకటి లీనియాలో మాదిరిగానే ఉంటుంది.

2014 ఫియట్ లీనియా విడుదల

స్టీరింగ్ వీల్‌పై ఆడియో మరియు టెలిఫోన్/బ్లూటూత్ కంట్రోల్స్‌ను ఇందులో కొత్తగా ఆఫర్ చేస్తున్నారు. వీటి సాయంతో మ్యూజిక్ సిస్టమ్ యొక్క సౌండ్‌ను తగ్గించుకోవటం, పెంచుకోవటం, మ్యూట్ చేయటంతో పాటుగా పాటలను కూడా మార్చుకోవచ్చు. అలాగే బ్లూటూత్ సాయంతో టెలిఫోన్ కాల్స్‌ను కూడా అటెండ్ చేయవచ్చు.

2014 ఫియట్ లీనియా విడుదల

కొత్త ఫియట్ లీనియాలో యుటిలిటీ స్పేస్‌ను చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఈ కారు వెనుక సీటులో ఉండే ఫోల్డబిల్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది ఓపెనబుల్‌గా ఉండి, ఇందులో రెండు కప్ హోల్డర్లు మరియు చిన్నపాటి యుటిలిటీ స్పేస్ ఉంటుంది.

2014 ఫియట్ లీనియా విడుదల

కొత్త ఫియట్ లీనియాలో ఎక్విప్‌మెంట్స్ విషయానికి వస్తే.. ఎంట్రీ లెవల్ (లీనియా యాక్టివ్) వేరియంట్లో స్టీరియో, ఆల్ పవర్ విండోస్, టిల్ట్ అడ్జస్టబల్ పవర్ స్టీరింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ విత్ ప్రోగ్రామబల్ ఫాలో-మి-హోమ్ ఫంక్షన్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, సెంట్రల్ లాగింక్, మైలేజ్ కంప్యూటర్, రియర్ డిఫాగ్గర్ ఆల్-రౌండ్ డిస్క్ బ్రేక్స్ మరియు యాంటీ-లాక్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

2014 ఫియట్ లీనియా విడుదల

మిడ్-లెవల్ వేరియంట్ (లీనియా డైనమిక్)లో యాక్టివ్ వేరియంట్లోని ఫీచర్లకు అదనంగా.. ఫ్రంట్ డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సిడి, యూఎస్‌బి, ఆక్స్, బ్లూటూత్ మరియు బ్లూ అండ్ మి టెక్నాలజీ (ఒకేసారి 5 ఫోన్లను ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేసుకునే సౌకర్యం)తో కలిగిన స్టీరియో సిస్టమ్, నాలుగు స్పీకర్లు, 2 ట్వీటర్లు, కప్ హోల్డర్లతో కూడిన రియర్ ఆర్మ్‌రెస్ట్స్, రియర్ ఏసి వెంట్స్, హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, లెథర్‌తో కవర్ చేయబడిన గేర్ నాబ్ మరియు స్టీరింగ్ వీల్ ఫీచర్లు లభిస్తాయి.

2014 ఫియట్ లీనియా విడుదల

ఇక టాప్-ఎండ్ వేరియంట్ (లీనియా ఎమోషన్)లో డైనమిక్ వేరియంట్లోని ఫీచర్లకు అధనంగా.. క్రూయిజ్ కంట్రోల్, లెథర్ సీట్స్, రియర్ సన్ బ్లైండ్ మరియు 205/55 టైర్లతో కూడిన 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

2014 ఫియట్ లీనియా విడుదల

కొత్త ఫియట్ లీనియా టి-జెట్ ఇదివరకటి ఇంజన్ ఆప్షన్లతోనే లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో టర్బోచార్జ్డ్ 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ (116 పిఎస్ పవర్, 207 ఎన్ఎమ్ టార్క్) మరియు డీజిల్ వెర్షన్‌లో 1.3 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ (93 పిఎస్ పవర్, 209 ఎన్ఎమ్ టార్క్)లను ఉపయోగించారు. రెండు ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో లభిస్తాయి. ఇందులో ఆటోమేటిక్ అందుబాటులో లేదు.

2014 ఫియట్ లీనియా విడుదల

ఇకపోతే.. ఎంట్రీ లెవల్ ఫియట్ లీనియా యాక్టివ్ వేరియంట్లో టర్బోచార్జర్ లేని రెగ్యులర్ 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ (90 పిఎస్ పవర్, 115 ఎన్ఎమ్ టార్క్)ను ఉపయోగించారు. ఇది కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తోనే లభిస్తుంది.

పెట్రోల్ వెర్షన్ 2014 ఫియట్ లీనియా ధరలు:

పెట్రోల్ వెర్షన్ 2014 ఫియట్ లీనియా ధరలు:

* ఫియట్ లీనియా యాక్టివ్ (పెట్రోల్) - రూ.6.99 లక్షలు

* ఫియట్ లీనియా టి-జెట్ యాక్టివ్ (పెట్రోల్) - రూ.7.44 లక్షలు

* ఫియట్ లీనియా టి-జెట్ డైనమిక్ (పెట్రోల్) - రూ.8.53 లక్షలు

* ఫియట్ లీనియా టి-జెట్ ఎమోషన్ (పెట్రోల్) - రూ.9.01 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

డీజిల్ వెర్షన్ 2014 ఫియట్ లీనియా ధరలు:

డీజిల్ వెర్షన్ 2014 ఫియట్ లీనియా ధరలు:

* ఫియట్ లీనియా మల్టీ-జెట్ యాక్టివ్ (డీజిల్) - రూ.8.15 లక్షలు

* ఫియట్ లీనియా మల్టీ-జెట్ డైనమిక్ (డీజిల్) - రూ.9.27 లక్షలు

* ఫియట్ లీనియా మల్టీ-జెట్ ఎమోషన్ (డీజిల్) - రూ.9.72 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Most Read Articles

English summary
Fiat India has officially launched the face-lifted Linea which was fist showcased at the 2014 Auto Expo in last month. New Fiat Linea facelift price at INR 6.99 lakhs for the entry level Fiat Linea 1.4 Active. 
Story first published: Tuesday, March 4, 2014, 18:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X